టాలీవుడ్ డేరింగ్ డాషింగ్ హీరో సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు నేడు. లివింగ్ లెజెండ్ కృష్ణ బర్త్ డేను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు జరుపుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా అభిమానులు, చిత్ర ప్రముఖులు కృష్ణకు బర్త్ డే విషెష్ తెలియజేస్తున్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఆయన నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటున్నారు. 


ఇక ప్రియమైన తండ్రికి మహేష్ బర్త్ డే విషెస్ తెలియజేశారు. ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సందేశం పోస్ట్ చేశారు. ''హ్యాపీ బర్త్ డే నాన్న. ఎల్లప్పుడూ మంచి మార్గదర్శిగా ఉన్నందుకు ధన్యవాదాలు. ఎప్పటిలాగే నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను'' అంటూ మహేష్ ట్వీట్ చేశారు. తండ్రి కృష్ణతో కలిసి దిగిన ఫోటో కూడా పోస్ట్ చేశాడు. 


ప్రతి ఏడాది కృష్ణ పుట్టినరోజు మహేష్ తన లేటెస్ట్ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇస్తారు. దీనితో సర్కారు వారి పాట మూవీ నుండి మహేష్ లుక్ విడుదల చేస్తారంటూ ప్రచారం జరిగింది. చిత్ర యూనిట్ కూడా మొదట అప్డేట్ ఇవ్వాలని అనుకున్నారు. అయితే కరోనా వలన నెలకొని ఉన్న విషమ పరిస్థితుల నేపథ్యంలో వేడుకలకు సమయం కాదని భావించారు. అందుకే సర్కారు వారి పాట మూవీ నుండి అప్డేట్ ఇచ్చే ఆలోచన మానుకున్నారు.