వైరల్ అవుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు స్వెట్ షర్ట్, కాస్ట్ తెలిస్తే కళ్లు తిరగాల్సిందే.
టాలీవుడ్ కాస్ట్లీ హీరోలలో మహేష్ బాబు కూడా ఒకరు. ఆయన తీసుకునే రెమ్యూనరేషన్ తో పాటు.. ఆయన లైఫ్ స్టైల్ కూడా కాస్ట్లీనే. ఆయన ఎప్పుడు డిఫరెంట్ గా కనిపించినా.. ఆయన ధరించిన ఏదో ఒక వస్తువు వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా మహేష్ బాబు ధరించిన షర్ట్ కాస్ట్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు.. టాలీవుడ్ కాస్ట్లీ హీరోలలో ఒకరు. సూపర్ స్టార్ రెమ్యూనరేషన్ 100 కోట్లకు చేరిందని టాక్. ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా చేస్తోన్న మహేష్.. ఆతరువాత రాజమౌళితో పాన్ వరల్డ్ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈసినిమా తరువాత సూపర్ స్టార్ రేంజ్ ఎక్కడికి వేళ్తుందా అని ఫ్యాన్స్ తో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం రిలీజ్ కు రెడీ అవుతున్న గుంటూరు కారం సినిమాకు సబంధించి అప్ డేట్స్ వరుసగా వస్తున్నాయి. ఈ అప్ డేట్స్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తున్నాయి.
ఇక అది పక్కన పెడితే కాస్ట్లీ వస్తువులు వాడటంలో మహేష్ బాబురికార్డ్ వేరు. ఆయన వేసుకునే షర్ట్స్ , వాచ్, తిరిగే కార్లు.. అన్నీ లగ్జరీగానే ఉంటాయి. తాజాగా మహేష్ బాబు వేసుకున్న ఆరేంజ్ ఫుల్ హ్యాండ్స్ స్వెట్ షర్ట్ కాస్ట్ వైరల్ అవుతోంది. రీసెంట్ గా మహేష్ బాబు ఓ ప్రైవేట్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఇదే ఈవెంట్ లో విక్టరీ వెంకటేష్ కూడా సందడి చేశారు. పెద్డోడితో కలిసి చిన్నోడు చిన్నోడు సరదాగా గడిపారు. వీరిద్దరికి సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఇక వెంకీతో కలిసి ఉన్న ఫోటోను సూపర్ స్టార్ మహేష్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
పెద్దోడు పక్కన ఉంటే ఎంతో సరదాగా ఉంటుందంటూ వెంకటేశ్ తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు మహేష్. ఈ ఫోటో క్షణాల్లోనే వైరలయ్యింది. అయితే అందులో మహేష్ ఆరెంజ్ కలర్ స్వెట్ షర్ట్ లో సూపర్ హ్యాండ్సమ్ గా కనిపించారు మహేష్. స్టైలీష్ గా ఉన్నాడు. 50 ఏళ్లు దగ్గరకు వస్తున్నా.. ఆయన అందం ఏమాత్రం తగ్గలేదు. ఇక ఆయన వేసుకున్న షర్ట్ గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఈ షర్ట్ ధర గురించి నెట్టింట చర్చ జరుగుతుంది. మహేష్ ధరించిన బాబు వేసుకున్న హీర్మేస్ స్వెట్‌షర్ట్ ధర 1,21,330 ఉంటుందట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ షర్ట్ కాస్ట్ తెలుసుకుని మహేష్ బాబు ఫ్యాన్స్ ఇంకా వైరల్ చేస్తున్నారు.