Asianet News TeluguAsianet News Telugu

మండే ఎండాకాలం మంచులో ఎంజాయ్ చేస్తున్న మహేష్ బాబు ఫ్యామిలీ.. వైరల్ పిక్స్..

ఎండలు మండుతుంటే.. మంచు వర్షంలో తడుస్తున్నారు మహేష్ బాబు ఫ్యామిలీ. ఇంత ఎండల్లో వాళ్లకు మంచు ఎక్కడి నుంచి వచ్చిందంటే..? 
 

Super Star Mahesh babu and Family Enjoying Summer Vacation at Switzerland JMS
Author
First Published Mar 28, 2024, 8:32 PM IST

ఎండలు మండుతున్నాయి... పగలు అడుగు బయటపెట్టాలంటే భయపడుతున్నారు సామాన్యులు. ఇక సెలబ్రిటీలైతే.. ఈ ఎండలు తట్టుకోలేక వెకేషన్ల బాటపడుతున్నారు. ఇక టాలీవుడ్ నుంచి స్టార్ హీరోలు ఫ్యామిలీతో కూల్ అవ్వడానికి విదేశాలకు చెక్కేస్తున్నారు. మరికొంత మంది వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక వెకేషన్ అంటే ముందుగా  టాలీవుడ్ నుంచి గుర్తుకు వచ్చేది సూపర్ స్టార్ మహేశ్ బాబు కుటుంబం. ఏడాదికి ఏడెనిమిది సార్లు వెకేషన్లంటూ..విదేశాల్లో గడిపి వస్తుంటారు సూపర్ స్టార్ ఫ్యామిలీ. ఇక సమ్మర్ వచ్చిందంటే ఆగుతారా ఏంటి.. 

ఇక ఈసారి సమ్మర్ వెకేషన్ కు స్విట్జర్లాండ్ లో ప్లాన్ చేశారు మహేష్. రీసెంట్ గా ఎయిర్ పోర్ట్ లో కూడా దర్శనం ఇచ్చారు. ఇక అక్కడ మంచులో ఎంజాయ్ చేస్తోంది ఫ్యామిలీ. . మహేశ్ భార్య నమ్రత, కొడుకు గౌతమ్, కూతురు సితారలు స్విట్జర్లాండ్ కు వెళ్లారు. ఇక అక్కడ మహేష్ బాబు ఫ్యామిలీ  మంచులో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.  ఈ ఫొటోలను నమ్రత ఇన్స్ట్రాలో పోస్ట్ చేశారు. హాట్ సమ్మర్ లో కూల్ గా ఎంజాయ్ చేస్తున్నారంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. 

 

ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే.. ఆయన రీసెంట్ గా గుంటూరు కారం సినిమాతో హిట్ కొట్టారు. ఇక రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నారు. జక్కన్న సినిమా స్టార్ట్ అయితే.. రెండు మూడేళ్లు పట్టే అవకాశం ఉండటంతో ఈ వెకేషన్ ను గట్టిగా ప్లాన్ చేవాడట మహేష్. అమెజాన్ అడవుల్లో జరిగే అడ్వెంచర్ మూవీగా ఈసినిమా రూపొందబోతుంది. పాన్ వరల్డ్ స్థాయిల్ జక్కన్న ఈసినిమా ప్లాన్ చేస్తున్నారు. 

ఇటు సినిమాలు అటు కమర్షియల్ యాడ్స్ తో చేతినిండా సంపాదిస్తున్నాడు మహేష్. అటు చిన్నారు ప్రాణాలు కాపాడుతూ.. వారికి కావల్సిన ఆపరేషప్లు చేయిస్తూ.. తన మంచి మనసు చాటుకుంటున్నాడు. సూపర్ స్టార్ , రాజమౌళి సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios