స్టార్ డమ్ వచ్చిందని ముఖం చాటేశాడు.. 'RX100' హీరోపై ఆరోపణలు!

First Published 4, Sep 2018, 11:25 AM IST
supari movie producer allegations on rx100 hero karthikeya
Highlights

'RX100' చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు కార్తికేయ. మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్న ఈ హీరోకి ఇండస్ట్రీలో క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం ఈ హీరో తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమాలో నటిస్తున్నాడు. 

'RX100' చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు కార్తికేయ. మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్న ఈ హీరోకి ఇండస్ట్రీలో క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం ఈ హీరో తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమాలో నటిస్తున్నాడు. పలు ఆఫర్లు ఆయన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి. ఈ క్రమంలో అతడి తాజా సినిమా విడుదలవుతుందంటూ నిన్న పత్రికల్లో వార్తలు వచ్చాయి. అదే 'సుఫారి'.

అయితే ఈ సినిమాతో తనకు సంబంధం లేదని ఇప్పుడు ముఖం చాటేస్తున్నాడని చిత్రనిర్మాతలు కార్తికేయపై ఆరోపణలు చేస్తున్నారు. 'RX100' కంటే ముందు కార్తికేయ ఈ సినిమాలోనే నటించారని ఇప్పుడు ఆయనకు స్టార్ డమ్ రాగానే మమ్మల్ని పట్టించుకోవడం లేదని నిర్మాత వేణు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన వీడియోలు కూడా విడుదలయ్యాయి.

అయితే ఈ విషయంపై స్పందించిన హీరో కార్తికేయ.. ''ఆ వీడియో నాపై చిత్రీకరించిందే.. కానీ ఆ సినిమాలో మాత్రం నేను నటించలేదు. డెమో రీల్ షూట్ చేసి దాన్ని సినిమాకి వాడుకున్నారు. షూటింగ్ మొదలవుతుందని చెప్పారు కానీ అది మాత్రం జరగలేదు. నేను ఈ సినిమాలో నటించలేదు'' అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ఇక ఈ నాన్సెన్స్ ఆపండంటూ ఫైర్ అయ్యాడు. మరి ఈ విషయంలో ఏవి నిజానిజాలో అర్థంకాక అభిమానుల్లో ఒకటే చర్చ. మరి ఈ వివాదం ఎక్కడ వరకు వెళ్తుందో చూడాలి!

 

loader