ఒకప్పుడు ఐటమ్ గాళ్ల్స్ వెండితెరను ఒక ఊపు ఊపేసిన తారలు. రకరకాల విమర్శలు కూడా ఫేస్ చేశారు. కాిన ఇప్పుడు గౌరవంగా బ్రతుకుతున్న స్టార్స్ ఎవరో తెలుసా?
అవును, ఆ ఇద్దరు నటీమణులు ప్రపంచానికి హాట్ సినిమాలు చేసేవాళ్లు అన్న ముద్రపడిపోయింది. . చాలామంది కడుపు నింపుకోవడానికి ఏదో ఒక పని చేస్తే, వీళ్లిద్దరూ అందం చూపిస్తూ డబ్బు సంపాదించారు. అప్పుడు ప్రపంచం వాళ్ళని చూసే దృష్టి వేరుగా ఉండేది. కానీ, ఇప్పుడు ఈ ఇద్దరు నటీమణులు తమ వృత్తిని మార్చుకుని గౌరవంగా బతుకుతున్నారు.
ఇంత చెప్పగానే చాలామందికి అర్థమై ఉంటుంది, వాళ్ళెవరో కాదు, సన్నీ లియోన్ (Sunny Leone), షకీలా (Shakeela). అవును, వాళ్లిద్దరూ మొదట్లో డబ్బు కోసం ఇలా చేశారు. కానీ, ఆ తర్వాత వాళ్ళ జీవితాలను మార్చుకున్నారు. డబ్బు సంపాదించడానికి మిగతావాళ్లలాగే తమ టాలెంట్‌ను చూపించడం మొదలుపెట్టారు.
సన్నీ లియోన్ ఇప్పుడు ముగ్గురు పిల్లల్ని దత్తత తీసుకుని పెంచుతోంది. వాళ్లలో అమ్మాయిలు, అబ్బాయిలు ఉన్నారు. వాళ్లందరినీ సొంత పిల్లల్లా చూసుకుంటోంది. సన్నీ లియోన్, ఆమె భర్త డేనియల్ వెబ్బర్ ఇప్పుడు చాలా సామాజిక సేవ చేస్తున్నారు. వాళ్ళ గురించి ఇదివరకు ఉన్న అభిప్రాయం ఇప్పుడు మారింది.
షకీలా మలయాళ నటి. ఆమె దక్షిణ భారతదేశ సినిమాల్లో గ్లామరస్ పాత్రల్లో నటించింది. మిగతా నటీమణులలాగే టాలెంట్, అందం చూపిస్తూ డబ్బు సంపాదిస్తోంది. ఇదివరకులా డైరెక్ట్‌గా శరీరాన్ని అమ్ముకుని డబ్బు సంపాదించడం లేదు. సన్నీ లియోన్ కెనడా నటి, కానీ ఇప్పుడు ముంబైలో ఉంటోంది. ఇది సమాజంలో అందరూ ఒప్పుకునే పనే. ఎవరికైనా బతకడానికి ఒక దారి ఉండాలి కదా? వాళ్ళు అదే చేస్తున్నారు. అందులో తప్పేముంది..?
సన్నీ లియోన్, షకీలా ఇద్దరూ ఇప్పుడు తాము సంపాదించిన డబ్బులో కొంత భాగాన్ని సమాజంలో బాధల్లో ఉన్నవాళ్ల కోసం ఇస్తున్నారు. ప్రతి సంవత్సరం చాలామంది పేదలకు సహాయం చేస్తున్నారు. చారిటీ చేస్తూ, కష్టాల్లో ఉన్నవాళ్లకు తమకు తోచినంత సాయం చేస్తున్నారు. దీన్నే కదా మారడం అంటారు? అవును, వాళ్లిద్దరూ మారారు..!