టాలీవుడ్‌ ప్రముఖ గాయని సునీత పెళ్లి ఈ రోజే జరగబోతోంది. ప్రముఖ డిజిటల్ మీడియా అధినేత రామ్‌ వీరపనేనితో సునీత ఏడడుగులు వేయబోతున్నారు. ఈ వివాహానికి జనవరి 9వ తేదీ అంటే ఈ రోజు సాయింత్రం ముహూర్తంగా ఫిక్స్ చేశారు. కుటుంబ సభ్యుల, సన్నిహితుల సమక్షంలో ఈ వివాహం జరగబోతోంది. వందల ఏళ్ళ చరిత్ర కలిగిన పురాతన శ్రీరామచంద్రస్వాముల వారి గుళ్లో సునీత రెండో పెళ్ళి చేసుకుంటుండడం విశేషం. 

మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుని రామ్‌ వీరపనేనితో సునీత రెండో పెళ్లికి సిద్ధమయ్యారు. కొన్నిరోజుల ముందే హైదరాబాద్‌లో కుటుంబ సభ్యుల, సన్నిహితుల సమక్షంలో రామ్‌, సునీతల నిశ్చితార్థం జరిగింది. ఇటీవలె వీరిద్దరూ కలిసి సింగర్స్‌ యూనిట్‌కి గ్రాండ్‌ పార్టీ ఇచ్చారు.ఆ తర్వాత సినీ పరిశ్రమలోని ఇతర సెలబ్రిటీల కోసం ప్రీ వెడ్డింగ్‌ పార్టీని ఏర్పాటు చేశారు. 
 
ఈ  పెళ్ళికి కేవలం కుటుంబ సభ్యులు, కొద్దిమంది కామన్ ఫ్రెండ్స్, దిల్ రాజు వంటి కొందరు సెలెబ్రిటీలు మాత్రమే హాజరవుతారు. 43 ఏళ్ళ సునీతకి ఇద్దరు పిల్లలు. వారు ముందుండి ఈ పెళ్లిని జరుపుతున్నట్లు తెలుస్తోంది. వివాహానంతరం ఈ జంట కొత్త ఇంట్లోకి మూవ్ అవుతుంది.

ఇక టాలీవుడ్‌లో ఉన్న మేటి ప్ర‌తిభావ‌ని సీనియ‌ర్‌ గాయ‌ని సునీత‌. కోటానుకోట్ల హృద‌యాల్ని గెలిచిన గొప్ప నేప‌థ్య గాయ‌ని. అయితే సునీత వ్య‌క్తిగ‌త జీవితం ప‌రంగా కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కోవ‌డం, అటుపై మీడియా ప్ర‌చారం గురించి తెలిసిందే. అదంతా అటుంచితే సునీత 19 వ‌య‌సులో కిర‌ణ్ అనే వ్య‌క్తిని పెళ్లాడారు. ఆ జంట‌కు ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. అయితే కాల‌క్ర‌మంలో ఆ ఇద్ద‌రూ విడాకులు తీసుకున్నారు. ప్ర‌స్తుతం ఇద్ద‌రు పిల్ల‌లతో క‌లిసి సునీత విడిగా ఉంటున్నారు.