Asianet News TeluguAsianet News Telugu

సునీల్ చెలరేగిపోతాడట.. త్రివిక్రమ్ డైలాగ్స్ రెడీ!

త్రివిక్రమ్ శ్రీనివాస్, నటుడు సునీల్ మధ్య సాన్నిహిత్యం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. దాదాపుగా త్రివిక్రమ్ అన్ని చిత్రాల్లో సునీల్ కనిపిస్తాడు. 

Sunil signed for Allu Arjun 19th movie
Author
Hyderabad, First Published Jun 8, 2019, 8:23 PM IST

త్రివిక్రమ్ శ్రీనివాస్, నటుడు సునీల్ మధ్య సాన్నిహిత్యం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. దాదాపుగా త్రివిక్రమ్ అన్ని చిత్రాల్లో సునీల్ కనిపిస్తాడు. త్రివిక్రమ్ రాసిన కామెడీ పంచులని సునీల్ తనదైన శైలిలో పలికి కడుపుబ్బా నవ్వించాడు. తిరుగులేని కమెడియన్ గా ఎదుగుతున్న సమయంలో సునీల్ హీరోగా మారిన సంగతి తెలిసిందే. సునీల్ కు హీరోగా పెద్దగా కలసి రాలేదు. దీనితో ప్రస్తుతం మళ్ళీ కామెడీ పాత్రలు చేస్తున్నాడు. 

గత ఏడాది విడుదలైన త్రివిక్రమ్, ఎన్టీఆర్ చిత్రం అరవింద సమేతలో సునీల్ కీలక పాత్రలో నటించాడు. కానీ అందులో పెద్దగా కామెడీ టచ్ లేదు. త్రివిక్రమ్, బన్నీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రంలో కూడా సునీల్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో త్రివిక్రమ్ సునీల్ పాత్రకు అదిరిపోయే కామెడీ డైలాగ్స్ రాసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఆడియన్స్ నువ్వే నువ్వే, నువ్వు నాకు నచ్చావ్ సమయంలో సునీల్ ని చూడబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్. 

త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. పూజా హెగ్డే, నివేదా పేతురేజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని, గీత ఆర్ట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios