Asianet News TeluguAsianet News Telugu

వెంకీకే తప్ప లేదని...సందీప్ కిషన్ సరే అన్నాడు?

 ఈ సంవత్సరం మొదటల్లో ఎ1 ఎక్సప్రెస్ తో థియోటర్ లో దిగిన సందీప్ కిషన్ ఈ సారి తన తాజా చిత్రంతో ఓటీటిలోకి రాబోతున్నారు. 

Sundeep Kishans Gully Rowdy heads OTT way jsp
Author
Hyderabad, First Published Jul 1, 2021, 1:58 PM IST

పెద్ద సినిమాలు నారప్ప, దృశ్యం 2 వంటివే ఓటీటి బాటపడుతున్నాయి. దీంతో మరిన్ని మీడియం,చిన్న సినిమాలు సైతం ఓటీటి ని ఎంచుకుంటున్నాయి. ఈ సిట్యువేషన్స్ అన్నీ గమనిస్తున్న  ‘గల్లీరౌడీ’ టీమ్ సైతం టైమ్ చూసి ఓటిటీ లోకి తమ సినిమాని దించబోతున్నట్లు సమాచారం. ఈ సంవత్సరం మొదటల్లో ఎ1 ఎక్సప్రెస్ తో థియోటర్ లో దిగిన సందీప్ కిషన్ ఈ సారి తన తాజా చిత్రంతో ఓటీటిలోకి రాబోతున్నారు. ఈ మేరకు స్ట్రీమింగ్ కంపెనీలతో డిస్కషన్స్, బేరసారాలు గత కొద్ది రోజులుగా జరుగుతున్నట్లు సమాచారం. ఫైనల్ గా భారీ రేటుకే ప్రముఖ స్ట్రీమింగ్ కంపెనీ చిత్రం రైట్స్ సొంతం చేసుకుందని, త్వరలోనే అఫీషియల్ ఎనౌన్సమెంట్ రాబోతోందని వినికిడి. 

సందీప్‌ కిషన్ త్వరలోనే ‘గల్లీరౌడీ’గా  ప్రేక్షకుల ముందుకు రానున్నాడు‌. జి.నాగేశ్వర రెడ్డి తెరకెక్కిస్తోన్న చిత్రమిది. నేహా శెట్టి హీరోయిన్ గా. బాబీ సింహా కీలక పాత్రలో కనిపించనున్నారు.  పోస్ట్‌ ప్రొడక్షన్‌ సహా కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయని, సెన్సార్‌కు తొలి కాపీని సిద్ధం చేస్తున్నామని ఎవివి తెలిపారు. ఇది ఎంవివి, నాగేశ్వర్‌ రెడ్డి కలిసి పనిచేసిన రెండో చిత్రం. ఇది మరో 'ఢీ' లాంటి సినిమా అని ఎంవివి తెలిపారు. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్‌ భయస్తుడైన కానిస్టేబుల్‌గా నటించారు. బాబీ సింహా ఈ సినిమాలో కీ రోల్‌ ప్లే చేశాడు.

 ‘‘సందీప్‌ ఇప్పటి వరకు చేయని ఓ విభిన్న పాత్రను ఈ చిత్రంలో పోషించారు. కొత్తదనం నిండిన వినోదాత్మక కథతో రూపొందింది. సినిమా బాగా వచ్చింది. రాజేంద్రప్రసాద్, బాబీ సింహా కీలక పాత్రల్లో నటించారు. వారి నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. నేహా శెట్టి పాత్ర అందరినీ అలరిస్తుంది. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసి, త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని దర్శక నిర్మాతలు తెలియజేశారు.

ఈ చిత్రాన్ని కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చౌరస్తా రామ్‌, సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘పుట్టెనే ప్రేమ..’ అనే పాట, టీజర్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.   ఈ చిత్రానికి సంగీతం: చౌరస్తా రామ్, సాయికార్తీక్, ఛాయాగ్రహణం: సుజాత సిద్ధార్థ్‌.

Follow Us:
Download App:
  • android
  • ios