Asianet News TeluguAsianet News Telugu

Pushpa 2: 'పుష్ప 2' రిలీజ్ డేట్ పై క్లారిటీ, ఇప్పుడప్పుడే కాదు

దర్శకుడు సుకుమార్ ‘శేఖర్’ కార్యక్రమానికి అతిథిగా హాజరై ‘పుష్ప’ పార్ట్ 2 గురించి కొన్ని విషయాలు అన్యాపదేశంగా చెప్పారు. దాన్ని బట్టి అర్దమైన విషయం ... డిసెంబర్ 2023లో 'పుష్ప 2' విడుదలను ప్లాన్ చేయాలని నిర్ణయించుకున్నారు. 

Sukumar Pushpa 2 for December 2023
Author
Hyderabad, First Published May 18, 2022, 4:18 PM IST


అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన 'పుష్ప' సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిన సంగతే. బన్నీ కెరీర్లో తొలి పాన్ ఇండియా సినిమాగా వచ్చిన ఈ మూవీ అనేక రికార్డులు చెరిపేస్తూ భారీ వసూళ్లు రాబట్టింది. చిత్రంలో అల్లు అర్జున్ నటన, సుకుమార్ టేకింగ్‌పై ప్రశంసల వర్షం కురిసింది. తెలుగుతో పాటు హిందీలోనూ ప్రభంజనం సృష్టించింది. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు ముందే ప్రకటించిన సుక్కు.. తొలి భాగాన్ని 'పుష్ప ది రైజ్' పేరుతో ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ప్రస్తుతం రెండో భాగం ‘పుష్ప ది రూల్’ పేరుతో ఈ చిత్రాన్ని అతిత్వరలో సెట్స్ మీదకు తీసుకురాబోతున్నారు. మరోవైపు జనాల్లోనూ సెకండ్ పార్ట్‌పై ఓ రేంజ్ అంచనాలున్నాయి. 

ఈ నేపధ్యంలో 'పుష్ప 2' విడుదల తేదీ చుట్టూ అనేక వార్తలు, స్పెక్యులేషన్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు క్లియర్ పిక్చర్ వస్తోంది.  దర్శకుడు సుకుమార్ ‘శేఖర్’ కార్యక్రమానికి అతిథిగా హాజరై ‘పుష్ప’ పార్ట్ 2 గురించి కొన్ని విషయాలు అన్యాపదేశంగా చెప్పారు. దాన్ని బట్టి అర్దమైన విషయం ... డిసెంబర్ 2023లో 'పుష్ప 2' విడుదలను ప్లాన్ చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు తాము అనుకున్నట్లుగా  ప్రమోషన్‌లను ప్లాన్ చేయడానికి మరియు సినిమాను భారీ స్థాయిలో చేయడానికి వారి చేతుల్లో చాలా టైమ్ ఉంటుంది.

హిందీ మార్కెట్‌లో ‘కెజిఎఫ్ 2’ ఘనవిజయం తర్వాత, అల్లు అర్జున్ మరియు సుకుమార్ తమ సినిమాను అంతకు మించి రెడీ చేయాలని డిసైడ్ అయ్యారు.  ‘కేజీఎఫ్’ తొలి భాగం హిందీలో ఓ మోస్తరు విజయం సాధించినా రెండో పార్టీకి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దానికి తోడు ‘పుష్ప’ హిందీ మార్కెట్‌లో పెద్ద సక్సెస్ నమోదు చేసింది. దాంతో ‘కేజీఎఫ్ 2’ కంటే రెండో భాగానికి క్రేజ్ మరింత ఎక్కువగానే ఉంటుందని లెక్కేస్తున్నారు. మరో రెండు నెలల్లో షూటింగ్‌ ప్రారంభం కానుంది.

పుష్ప పార్ట్- 1 డిసెంబర్ 17న విడుదలై భారీ సక్సెస్ అయిన కారణంగా పుష్ప పార్ట్- 2 విషయంలోనూ అదే సెటిమెంట్ ఫాలో కాబోతున్నారని, ఈ మేరకు పుష్ప రెండో భాగం రిలీజ్ కోసం డిసెంబర్ 17నే ముహూర్తంగా ఎంచుకున్నారని ఇన్ సైడ్ టాక్. మరోవైపు అల్లు అర్జున్ కూడా ‘పుష్ప- 1’ గెటప్‌నే కంటిన్యూ చేస్తుండటం చూస్తుంటే ఈ సినిమాపై ఎంత శ్రద్ద పెట్టారో తెలుస్తోంది.  ‘పుష్ప 2’ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలు పోషించారు.

"ఆర్ ఆర్ ఆర్", "కే జి ఎఫ్ 2" వంటి సినిమాల సక్సెస్ చూసిన తర్వాత "పుష్ప 2" కూడా అదే రేంజ్ లో బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. మరోవైపు ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనడం తో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం "పుష్ప: ది రూల్" ప్రీ రిలీజ్ బిజినెస్ 700 కోట్లు చేసినట్లు సమాచారం. అందులో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ మాత్రమే 300 కోట్లకు అమ్ముడయినట్లు తెలుస్తోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios