Asianet News TeluguAsianet News Telugu

లార్గో వించ్ కాపీ కామెంట్స్ పై స్పందించిన సుజిత్

భారీ అంచనాల మధ్య విడుదలైన సాహో ఊహించని టాక్ ను అందుకుంది. ప్రేక్షకులను పూర్తిగా మెప్పించడంలో విఫలమైనట్లు రివ్యూలు రావడం చిత్ర యూనిట్ ని అసంతృప్తికి లోను చేసినట్లు అర్ధమవుతోంది. రీసెంట్ గా దర్శకుడు సుజిత్ ఇన్స్టాగ్రామ్ లో ఎమోషనల్ గా తన జర్నీని వివరిస్తూ సినిమాను మరోసారి చూడండని పోస్ట్ చేశాడు. 

 

sujith about largo winch copy comments
Author
Hyderabad, First Published Sep 6, 2019, 11:29 AM IST

భారీ అంచనాల మధ్య విడుదలైన సాహో ఊహించని టాక్ ను అందుకుంది. ప్రేక్షకులను పూర్తిగా మెప్పించడంలో విఫలమైనట్లు రివ్యూలు రావడం చిత్ర యూనిట్ ని అసంతృప్తికి లోను చేసినట్లు అర్ధమవుతోంది. రీసెంట్ గా దర్శకుడు సుజిత్ ఇన్స్టాగ్రామ్ లో ఎమోషనల్ గా తన జర్నీని వివరిస్తూ సినిమాను మరోసారి చూడండని పోస్ట్ చేశాడు. 

అయితే మొదట అలా చేయకూడదని అనుకున్నాడట. అలాగే లార్గో వించ్ కి ఈ సినిమాజా కాపీ అంటూ వచ్చిన కామెంట్స్ పై కూడా సుజిత్ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించాడు. ప్రపంచానికి తెలియకుండా కొడుకును దాచిపెట్టడం అనే కాన్సెప్ట్ తో చాలా సినిమాలు వచ్చాయి. కాపీ అనే కామెంట్ చేసేవారు చాలా మంది ఆ సినిమా చూసి ఉండరు. అయినా చూసే సినిమా కూడా కాదది. 

ఇక ఇన్స్టాగ్రామ్ లో మొదట ఆగ్రహంతో పోస్ట్ చేయాలనీ అనుకున్నా. కానీ వెంటనే  ఆగిపోయాను. అందుకు కారణం ఉంది. చాలా మంది సెకండ్ టైమ్ చూసాక సినిమా చాలా నచ్చిందని అన్నారు. 

అందుకే మరోసారి చూస్తే ఎంజాయ్ చేస్తూ అర్ధం చేసుకుంటారనిపించింది. అర్ధం లేదు అనడానికి అర్ధం కాలేదు అనడానికి చాలా తేడా ఉంది. సినిమా కలెక్షన్స్ పెంచాలనే ఆలోచనతో అయితే చెప్పలేదు. అర్ధం చేసుకుంటారని పోస్ట్ చేశా. అదే విధంగా అర్ధం  లేకుండా సన్నివేశాలు అయితే రాయలేదు. తీయలేదు. దేశం మొత్తంలో అన్ని వర్గాల ఆడియెన్స్ ని మెప్పించాలి అనేది చాలా కష్టం. ఈ సినిమా ద్వారా పెద్ద హీరోలతో సినిమా చేసేటప్పుడు ఇంటిలిజెన్స్ ని తగ్గించుకొని ప్రతి విషయాన్నీ ఒలిచి చెప్పాలని నేర్చుకున్నా" అని సుజిత్ వివరణ ఇచ్చాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios