బిగ్ బాస్ తెలుగు 6లో 12వ రోజు `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` టీమ్ సందడి చేసింది. ఉత్తమ నటులను తేల్చి చెప్పింది.
బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ 12వ రోజు హౌజ్‌లో పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. కెప్టెన్సీ టాస్క్ లో డీజే పాటలకు కంటెస్టెంట్స్ డాన్సులతో రెచ్చిపోయారు. కెప్టెన్సీ కంటెండర్‌గా ఉన్న చంటి, ఆర్జే సూర్య, రాజశేఖర్, ఇనయ డీజే లుగా వ్యవహరించారు. ఇద్దరిద్దరు కలిసి తమ ఒక ఓటుగా కెప్టెన్సీ కండెండర్లకి వేయాల్సి ఉంది. ఇందులో ఎక్కువగా రాజశేఖర్‌కి వచ్చాయి. నాలుగు ఓట్లతో ఆయన కెప్టెన్ అయ్యారు. మూడు ఓట్లు ఆర్జే సూర్యకి, రెండు చంటికి, ఒకటి ఇనయకి వచ్చాయి.
ఇందులో అత్యధిక ఓట్లు వచ్చిన రాజశేఖర్ ఊహించని విధంగా కెప్టెన్ అయ్యారు. మూడో వారంలో ఆయన కెప్టెన్‌గా హౌజ్‌ని నిర్వహించబోతున్నారు. మొదటి కెప్టెన్‌గా బాలాదిత్య ఉన్న విషయం తెలిసిందే. అనంతరం హౌజ్‌లోకి `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` జంట సుధీర్‌బాబు, కృతి శెట్టి సందడి చేశారు. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా హౌజ్ లో కాసేపు రచ్చ చేశారు.
ఇందులో ఇంటి సభ్యులకు పలు సినిమాల్లోని సీన్లు ఇచ్చి యాక్ట్ చేసి చూపించాల్సి ఉంది. అయితే హౌజ్‌లోని విషయాలను ప్రస్తావిస్తూ ఆయా సన్నివేశాలు చేయాల్సి ఉంటుంది. ఇందులో రేవంత్ ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో అంటూ పోకిరి సీన్లు చేశారు. తనదైన స్టయిల్‌లో రొమాంటిక్‌గానూ చేశారు. ఆ తర్వాత గీతూ రాయల్ `బుజ్జిగాడు`లోని ప్రభాస్‌లా చేసింది. శ్రీహాన్, ఫైమా కలిసి `పోకిరి`లోని లిఫ్ట్ ఎపిసోడ్ చేసి నవ్వులు పూయించారు. రాజశేఖర్, శ్రీ సత్య కలిసి `ప్రేమ కథా చిత్రమ్` సీన్లు చేయగా, శానీ, చంటి, ఆర్ జే సూర్య, అభినయశ్రీ `వెంకీ` సినిమాలోని సీన్లు చేశారు.
హౌజ్‌లో ఈ ఎపిసోడ్ ఆద్యంతం నవ్వులు పూయించింది. సుధీర్‌బాబు, కృతి శెట్టి సైతం వీరి స్కిట్లని ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ నటీనటులను ఎంపిక చేయాల్సి ఉండగా, ఉత్తమ నటుడిగా శ్రీహాన్‌ని, ఉత్తమ నటిగా శ్రీసత్య గెలుచుకున్నారు. బిగ్ బాస్‌లో ఉత్తమ నటులుగా శ్రీహాన్, శ్రీ సత్య నిలవడం విశేషం. ఇందులో సప్తగిరి శ్రీహాన్ యాక్షన్ బాగా ఆకట్టుకుంది.
అనంతరం హౌజ్‌లో గ్రూప్ రాజకీయాలు, ఈగో రాజకీయాలు ప్రారంభమయ్యాయి. రేవంత్ బాగా హంగామా చేసే ప్రయత్నం చేశాడు. చంటిపై తీవ్ర ఆరోపణలు చేశాడు. తనని కామెడీ చేయడం రాదని, తను వేసేవే జోకులన్నట్టు చేస్తున్నాడని, తనని అవమానిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో ఇతర హౌజ్ మేట్స్ కి చెబుతూ మరింత రక్తికట్టించాడు. వాష్ రూమ్‌లో బట్టలు ఆరేసే విషయంలో ఫైమాపై కూడా చాలా విమర్శలు చేశారు. అలాగే ఇనయ, వాసంతి కూడా ఏదో ఆరోపణలు చేసుకుంటూ గుసగుస పెట్టుకుంటున్నారు.
