Asianet News TeluguAsianet News Telugu

‘హంట్‌’ OTT రిలీజ్ డేట్ ,ఇంత తొందరగానా? ,షాక్

సినిమా జనాల్లో నానుతుండగానే ఓటిటిలో వచ్చేస్తే వ్యూయర్ షిప్ ఎక్కువ శాతం ఉండే అవకాసం ఉంది. థియేటర్ లో ఆడని చాలా సినిమాలు ఓటిటిలో రికార్డ్ లు బ్రద్దలు కొట్టాయి. దాంతో ఓటిటికు అంత స్పీడుగా ఇచ్చేసారంటున్నారు.

Sudheer babu hunt film  OTT Release Date
Author
First Published Jan 31, 2023, 10:55 AM IST

టాలీవుడ్ హీరో సుధీర్ బాబు నటించిన తాజా చిత్రం హంట్. ఈ సినిమా రిపబ్లిక్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు  మేకర్స్ . శ్రీకాంత్. ప్రేమిస్తే భరత్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం మార్నింగ్ షోకే డివైడ్ టాక్ తెచ్చుకుంది. ముంబై పోలీస్ అనే మళయాళ చిత్రం రీమేక్ గా వచ్చిన ఈ సినిమా లో మెయిన్ ట్విస్ట్ ఇక్కడ వర్కవుట్ కాలేదు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసేసారు. 

అందుతున్న సమాచారం మేరకు అమేజాన్ ప్రైమ్ లో పిబ్రవరి 10 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఓటిటిలో ఈ చిత్రం  ఏ మేరకు జనాలను ఆకట్టుకుంటుందనేది చూడాలంటోంది ట్రేడ్. సినిమా జనాల్లో నానుతుండగానే ఓటిటిలో వచ్చేస్తే వ్యూయర్ షిప్ ఎక్కువ శాతం ఉండే అవకాసం ఉంది. థియేటర్ లో ఆడని చాలా సినిమాలు ఓటిటిలో రికార్డ్ లు బ్రద్దలు కొట్టాయి. దాంతో ఓటిటికు అంత స్పీడుగా ఇచ్చేసారంటున్నారు.
 
ఇక  ఇందులో సుధీర బాబు అర్జున్‌ అనే పోలీస్‌ అధికారిగా కనిపిస్తారు. ఈ పాత్ర రెండు కోణాల్లో కనిపిస్తుంది. గతం మర్చిపోవడానికి ముందు.. అర్జున్‌ ఎ పాత్ర ఎలా ఉండాలో స్పష్టంగా ఉంటుంది. కానీ, గతం మర్చిపోయిన తర్వాత.. అర్జున్‌ బి పాత్ర కాస్త భిన్నంగా ఉంటుంది.  ఈ పాత్రే కొంచెం కష్టమైంది. మెమోరీ లాస్‌ మీద వచ్చిన ‘గజినీ’ లాంటి పాత్రలకు పోలిక ఉండకూడదని కొత్తగా ప్రయత్నం చేశారు కానీ ఫలితం పెద్దగా కనపించటం లేదు.  
 
 హీరో సుధీర్‌బాబు మాట్లాడుతూ..  ‘‘హంట్‌’ (HUNT) ఓ విభిన్నమైన చిత్రం. దీన్ని ప్రారంభిస్తున్నప్పుడు ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారోనని భయపడ్డాం. కానీ, ఇప్పుడు సినిమా చూసి ప్రతి ఒక్కరూ అద్భుతమని చెబుతున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా ద్వితీయార్ధంలో చివరి 30నిమిషాలు అద్భుతమని చెబుతున్నారు. అందరికీ కృతజ్ఞతలు. నేనిప్పటి వరకు అన్నీ విభిన్నమైన సినిమాలే చేశాను. ఇకపైనా అలాగే చేస్తాను. రెగ్యులర్‌ చిత్రాలు చేయను’’ అన్నారు.

 ‘‘కంటెంట్‌ సినిమాల కోసం చూసే ప్రేక్షకులకు సరైన చిత్రమిది. సుధీర్‌బాబు కొత్తగా ప్రయత్నించారు’’అన్నారు నటుడు భరత్‌. దర్శకుడు మహేష్‌ మాట్లాడుతూ.. ‘‘నేనెప్పటికీ గర్వపడే సినిమా ఇది. తెలుగులో ఇలాంటి చిత్రం చేయడం ఇదే తొలిసారి. ఈతరహా పాత్రని సుధీర్‌ చేసినందుకు అందరూ మెచ్చుకుంటున్నారు’’ అన్నారు.

హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధంలేకుండా కొత్తద‌నంతో కూడిన క‌థాంశాల‌ను ఎంచుకుంటూ హీరోగా వైవిధ్య‌త‌ను చాటుకుంటున్నాడు సుధీర్‌బాబు. మొద‌టి నుండి విభిన్న క‌థ‌ల‌ను ఎంచుకుంటూ వ‌స్తున్న‌ సుధీర్ బాబుకు ‘స‌మ్మోహ‌నం’ మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ త‌ర్వాత వ‌రుస‌గా ‘వి’, ‘శ్రీదేవి సోడా సెంట‌ర్’ వంటి సినిమాల‌తో టాలీవుడ్‌లో మంచి న‌టుడిగా ప్ర‌త్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇటీవలే ఈయన నటించిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి పాజిటీవ్ టాక్‌ వచ్చిన కలెక్షన్లు మాత్ర ఆశించిన స్థాయిలో రాలేకపోతున్నాయి. హాంట్ పరిస్దితి అదే. ఇక ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం ఈయ‌న నాలుగు సినిమాల‌ను సెట్స్‌పైన ఉన్నాయి

Follow Us:
Download App:
  • android
  • ios