Asianet News TeluguAsianet News Telugu

ఎక్సక్లూజివ్: వర్మ చూపించబోయే ‘కోబ్రా’ఎవరంటే..?

రీసెంట్ గా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో దర్శకుడిగా తనేంటో మళ్లీ ప్రూవ్ చేసుకున్న రామ్ గోపాల్ వర్మ.. అదే ఊపులో ‘శశికళ’ బయోపిక్ ‌తో పాటు కేసీఆర్ జీవితంపై సినిమాలు తీస్తానని ప్రకటించారు. 

Stroy behind  RGV's COBRA movie story
Author
Hyderabad, First Published Apr 8, 2019, 11:27 AM IST

రీసెంట్ గా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో దర్శకుడిగా తనేంటో మళ్లీ ప్రూవ్ చేసుకున్న రామ్ గోపాల్ వర్మ.. అదే ఊపులో ‘శశికళ’ బయోపిక్ ‌తో పాటు కేసీఆర్ జీవితంపై సినిమాలు తీస్తానని ప్రకటించారు. అయినా జనం పెద్దగా ఆశ్చర్యపోలేదు. శశికళ తీస్తే మాకేంటి, కేసీఆర్ పై తీసేదేముంటుంది అని లైట్ తీసుకున్నారు. అయితే ఇది కాదు పద్దతి జనాలు మాట్లాడుకునే ప్రాజెక్టు ఎనౌన్స్ చేయాలని ఫిక్స్ అయ్యి పుట్టిన రోజున ఓ ప్రకటన చేసారు.

తనలో ఉన్న దర్శకుడితో పాటు నిర్మాతగా సత్తా చూపిన వర్మ ...  వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా..గాయకుడిగా ప్రూవ్ చేసుకున్నారు.  దాంతో  ఈ పుట్టినరోజున మరో సంచలన నిర్ణయం తీసుకుని నటుడుగా తెరంగ్రేటం చేస్తూ ‘కోబ్రా’అనే టైటిల్ తో ఓ చిత్రం ప్రకటించేసారు. 

ఆర్జీవీ గన్‌ షాట్‌ ఫిల్మ్స్‌ సంస్థ ‘కోబ్రా’ అనే ఈ  చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘శత్రువుని చంపడానికి త్రాచు పాముని చేరదీస్తే, ఎప్పుడో  ఒకప్పుడు మనల్ని కూడా కాటేస్తుంది’ అనే అంశం చుట్టూ నడిచే కథ ఇది. ఈ చిత్రంలో వర్మ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. వర్మ, అగస్త్య మంజు ఈ చిత్రానికి దర్శకులు. మరి ఈ చిత్రంలో కోబ్రా ఎవరు అనేది చర్చగా మారింది. ఎవరు చుట్టూ ఈ కథ తిరగబోతోందనేది ఆసక్తికరమైన విషయంగా మారింది. 

అందుతున్న సమాచారం మేరకు కోబ్రా సినిమా మొత్తం నయీం చుట్టూ తిరగబోతంది. కోబ్రా అనేది నయీం ని పట్టుకోవటానికి పెట్టుకున్న ఆపరేషన్ పేరు అని తెలుస్తోంది. నయీం ని పట్టుకునేందుకు సీఎం కేసీఆర్ తీసుకున్న ప్రత్యేక శ్రద్ద వంటి విషయాలు ఇందులో చర్చకు వస్తాయంటున్నారు.

2016 ఆగస్టు 8న షాద్‌నగర్‌ పట్టణ శివారులోని మిలీనియం టౌన్‌షిప్‌లో ఒక్కసారిగా పోలీసులు నయాం ఉన్న ఇంటిని చుట్టుముట్టడం వెనక ఎంత భారీ స్కెచ్ వేసారు.... తుపాకులెక్కుపెట్టి ఓ వ్యక్తిపై పోలీసులు ఏకదాటిగా ఎలా  కాల్పులు జరిపారు. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమైంది కరుడుగట్టిన నేరస్తుడు, వంద కేసుల్లో నిందితుడు, 40హత్య కేసుల్లో ప్రధాన నిందితుడు నయీం ని ఎలా హతమార్చాడు అనేది అసలు కథ అని తెలుస్తోంది.

సినిమాలో  ఓ మోస్ట్ వాంటెడ్  క్రిమినిల్ పట్టుకోవటానికి ఓ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ చేసే ప్రయత్నాలు...చివరకి ఎలా ఆ క్రిమినిల్ కథ ముగిసిందనేది చూపబోతున్నట్లు సమాచారం.   

Follow Us:
Download App:
  • android
  • ios