Asianet News TeluguAsianet News Telugu

రాజమౌళిని ఆకాశానికెత్తిన అమెరికన్ మీడియా , లాస్ ఏంజెలిస్ టైమ్స్ లో ప్రత్యేక కథనం

టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళికి  అరుదైన గౌరవం లభించింది. టాలీవుడ్, బాలీవుడ్ తో పాటు.. హాలీవుడ్ లో కూడా జక్కన్న పేరు మారుమోగుతుంది. ఈక్రమంలోనే అమెరికన్ మీడియా ప్రత్యేక కథనంతో రాజమౌళిని ఆకాశానికి ఎత్తింది. 

SS Rajamouli Special Article published in American Media
Author
First Published Nov 27, 2022, 9:03 AM IST

బాహుబలి రెండు సినిమాలతో  ప్రపంచ స్థాయి గుర్తింపు పొందాడు రాజమౌళి. తెలుగు సినిమా ఖ్యాతిని  అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాడు జక్కన్న. టాలీవుడ్ అగ్ర దర్శకుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా  ద్వారా తన ఇమేజ్ ను మరింత పెంచుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా మార్చ్ లో రిలీజ్ అయ్యి.. ఇప్పటికీ సరికొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేస్తూనే ఉంది.  ఎన్ని అవార్డ్స్ తో పాటు సోషల్ మీడియా రికార్డ్స్ ను కూడా తిరగరాసింది. అంతే కాదు ఇంటర్నేషనల్  ఫిలిం ఫెస్టివల్స్ లో స్క్రీనింగ్ అవుతూ.. ప్రపంచానని ఆకర్షించింది.

ఇప్పటికే ఈసినిమాపై ఎంతో మంది హాలీవుడ్ దర్శకులు ప్రశంసల జల్లు కురిపించారు. చాలా మంది ట్రోల్స్ కూడా చేశారనుకోండి. కాని ఎక్కువమంది హాలీవుడ్ ఆడియన్స్ రాజమౌళి టైకింగ్ కు.. ఆయన విజన్ కు పడిపోయారు. ఇక ప్రస్తుతం గోవాలో జరుగుతున్న  ఇఫీ చలనచిత్రోత్సవంలో ఆర్ఆర్ఆర్ ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే  ఆస్కార్ అవార్డులకు ముందు జరిగే  గవర్నర్ అవార్డుల వేడుకులో రీసెంట్ గా మెరిసారు రాజమౌళి.. ఈ కార్యక్రమం కోసం ఆయన  ఇటీవల అమెరికా వెళ్లారు. ఈ నేపథ్యంలో, అమెరికా మీడియాలో రాజమౌళిపై స్పెషల్ ఆర్టికల్ ప్రచురితం అయ్యింది. 

ప్రఖ్యాత లాస్ ఏంజెలిస్ టైమ్స్ పత్రిక  రాజమౌళిని ఆకాశానికి ఎత్తుతు.. పెద్ద పెద్ద హెడ్డింగ్స్ తో ప్రత్యేక కథనం రాసింది. ఆర్ఆర్ఆర్ డైరెక్టర్ ముంగిట భారీ అవకాశాలు' అంటూ రాజమౌళిపై ఆర్టికల్  ప్రచురించింది. ఎస్ఎస్ రాజమౌళి అమెరికన్ యాక్షన్ సినిమాలు చూస్తూ పెరిగాడని, ఇప్పుడు యావత్ అమెరికా రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ మూవీ  చూస్తూ ఊగిపోతోందని జక్కన్న టాలెంట్ ను ప్రపంచానికి తెలియజేస్తూ..  తన కథనంలో పేర్కొంది. 

ఇక ప్రస్తుతం ఆ ప్రత్యేక కథనానిక సబంధించిన పేపర్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజమౌళిపై లాస్ ఏంజెలిస్ టైమ్స్ లో ఇలా గోప్పగా ఆర్టికల్ రావడం  పట్ల అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఆలియా భట్, ఓలీవియో హీరోయిన్లుగా తెరకెక్కిన ట్రిపుల్ ఆర్.. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1200 కోట్ల వరకూ కలెక్షన్లు సాధించి.. బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రీసెంట్ గా జపాన్ లో కూడార రిలీజ్ అయిన ఈ మూవీ.. గతంలో ఉన్న రికార్డ్స్ అన్ని బ్రేక్ చేస్తూ వస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios