దీపిక పదుకొణెతో నాలుగోసారి షారుక్ జంటగా నటించిన ఈ చిత్రం విడుదలైన తొలి రోజు నుంచే భారీ వసూళ్లు సాధించింది. కలెక్షన్స్ సునామీ సృష్టిస్తోన్న పఠాన్ సినిమా ఇప్పుడు ఓటిటి రిలీజ్ కు రెడీ అయ్యింది.
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తాజా చిత్రం పఠాన్. దాదాపు ఐదేళ్ల తర్వాత వచ్చిన షారుక్ ఖాన్ సినిమా కావడంతో అభిమానులు భారీ ఎక్సపెక్టేషన్స్ తో రిలీజ్ అయ్యింది. అందుకు తగ్గట్లుగానే జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదలవడమే కాకుండా భారీ రెస్పాన్స్ అందుకుంది. దీపిక పదుకొణెతో నాలుగోసారి షారుక్ జంటగా నటించిన ఈ చిత్రం విడుదలైన తొలి రోజు నుంచే భారీ వసూళ్లు సాధించింది. కలెక్షన్స్ సునామీ సృష్టిస్తోన్న పఠాన్ సినిమా ఇప్పుడు ఓటిటి రిలీజ్ కు రెడీ అయ్యింది.
ఈ సినీమా పాన్ ఇండియా స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే ఈ చిత్రం ఈ మార్చ్ 25 నుంచి స్ట్రీమింగ్ కి రానున్నట్టుగా ఖరారు అయ్యింది. ఇక దీనిపై ప్రైమ్ వీడియో అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో అధికారికంగా అనౌన్సమెంట్స్ స్టార్ట్ కానున్నాయి. ఈ చిత్రం రైట్స్ ని వంద కోట్లకు అమేజాన్ సొంతం చేసుకున్నట్లు సమాచారం.
ఈ యాక్షన్ సినిమాకు సుమారు రూ. 250 బడ్జెట్ తో రూపొందింది. రూ.550 కోట్ల మేర కలెక్షన్స్ వసూలు అయ్యినట్లు ట్రేడ్ వర్గాల వెల్లడించాయి. ఇందులో రూ. 18.54 కోట్లు నెట్ దక్షిణాది భాషల నుంచి వసూళు కాగా.. రూ. 521.20 కోట్లు హిందీ బెల్ట్ ద్వారా వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే సినిమాకు రూ. 1044.50 కోట్లు గ్రాస్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ గా 8000లకు పైగా థియేటర్లలో విడుదల చేశారు.
యశ్ రాజ్ ఫిలిమ్స్ హిట్ కాంబినేషన్, క్రేజీ స్టార్ స్పెషల్ అప్పీయరెన్స్ మీద ఎక్కువ బేస్ అయి చేసిన సినిమా ఇది. తన గత చిత్రాల ఏజెంట్ టైగర్ (సల్మాన్ ఖాన్)నూ ఇందులో రంగంలోకి దింపింది. దేశంలోని టెర్రిరిస్ట్ కార్యకలాపాలను అదుపులోకి తీసుకురావడం కోసం అక్షయ్ కుమార్ ‘సూర్యవంశీ’ సినిమాలోకి అజయ్ దేవ్ గన్, రణవీర్ సింగ్ ను తీసుకొచ్చినట్టే… ఇందులో కూడా టైగర్ పాత్రధారి సల్మాన్ ఖాన్ ను ఓ కీలక సందర్భంలో ప్రవేశ పెట్టారు. ఆ సమయంలో ట్రైన్ మీద చిత్రీకరించిన యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి. సల్మాన్ ఖాన్ ప్రెజెన్స్ ను మాస్ ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. క్లయిమాక్స్ లోనూ వీరిద్దరి మధ్య పెట్టిన సరదా సంభాషణ కూడా బాగానే ఉంది.
