Asianet News TeluguAsianet News Telugu

శ్రీను వైట్ల తీసుకున్నది వర్కవుట్ అయ్యే నిర్ణయమేనా?

ఒకప్పుడు వరస హిట్స్..కామెడీ అంటే శ్రీను వైట్ల అనే పేరు...ఆయన సినిమాకు మినిమం గ్యారెంటీ ప్రేక్షకులు, బిజినెస్. ఇదంతా గతం. గత కొంత కాలంగా శ్రీను వైట్ల సిట్యువేషన్ ఆ సీన్ కు  రివర్స్ లో నడుస్తోంది. 

Srinu Vytla and his old writers working Together
Author
Hyderabad, First Published Jan 15, 2019, 10:53 AM IST

ఒకప్పుడు వరస హిట్స్..కామెడీ అంటే శ్రీను వైట్ల అనే పేరు...ఆయన సినిమాకు మినిమం గ్యారెంటీ ప్రేక్షకులు, బిజినెస్. ఇదంతా గతం. గత కొంత కాలంగా శ్రీను వైట్ల సిట్యువేషన్ ఆ సీన్ కు  రివర్స్ లో నడుస్తోంది. వరస డిజాస్టర్స్. ఆయన చేసిన కామెడీకు జనం నవ్వటం లేదు. జనం ధియోటర్ వదలి పారిపోయే పరిస్దితి మొన్న అమర్ అక్బర్ ఆంటోనితో వచ్చేసింది.  అయితే ఇంత జరిగాక ఇన్నాళ్ళకు శ్రీను వైట్ల రియలైజ్ అయ్యారట. తనకు కెరీర్ ప్రారంభంలో కలిసి పనిచేసి హిట్ ఇచ్చిన రైటర్స్ తో మళ్లీ కలిసి పనిచెయ్యాలనే నిర్ణయానికి వచ్చాడు.

ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం శ్రీను వైట్ల..విడిపోయిన తన పాత రైటర్స్ గోపీమోహన్, కోన వెంకట్ లను ఇద్దరిని పిలిచి స్క్రిప్టు వర్క్ మొదలెట్టారట. గోపీ మోహన్ ..ఇచ్చిన కథతో, కోన వెంకట్ డైలాగుతో తన పాత రోజుల నాటి హిట్ ని రిపీట్ చేయాలనుకుంటున్నారట. 

అయితే ఇందుకు కారణం..అదృష్టాన్ని వెతుక్కుంటూ వెళ్లటమేనా లేక..తన సినిమాకు ఇప్పుడు క్రేజ్ , బిజినెస్ ఉండదు కాబట్టి..ఇలా చేస్తే ట్రేడ్ దృష్టి తనపై పడుతుందని ఆలోచనే కారణమా అనేది సస్పెన్స్ గా ఉంది. ఏదైమైనా ఈ టీమ్ సక్సెస్ ఫుల్ కాబట్టి మళ్ళీ ఈ సారి హిట్ ఇచ్చి ఆ హవాని కంటిన్యూ చేయాలనుకుంటారు. అందులో అయితే సందేహం లేదు. కాబట్టి త్వరలో మళ్లీ మన ఢీ, రెడీ వంటి హిట్ ని చూడవచ్చు అన్నమాట. బీ రెడీ. 

Follow Us:
Download App:
  • android
  • ios