Asianet News TeluguAsianet News Telugu

Waltair Veerayya: 'శ్రీదేవి చిరంజీవి' సాంగ్... చిరు-శృతి పెయిర్ అదిరిందే, ఆకట్టుకున్న రొమాంటిక్ సాంగ్!


వాల్తేరు వీరయ్య విడుదల దగ్గర పడుతుంది. టీం ప్రమోషన్స్ విరివిగా నిర్వహిస్తున్నారు. దేవిశ్రీ కంపోజ్ చేసిన ఫస్ట్ సింగిల్ 'బాస్ పార్టీ' సూపర్ రెస్పాన్స్ దక్కించుకోగా.. సెకండ్ సింగిల్ 'శ్రీదేవి చిరంజీవి' విడుదల చేశారు. 
 

sridevi chiranjeevi song from waltair veerayya looks impressive
Author
First Published Dec 19, 2022, 6:23 PM IST

2023 సంక్రాంతి బరిలో చిరంజీవి వాల్తేరు వీరయ్యగా దిగుతున్న సంగతి తెలిసిందే. జనవరి 13న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా వాల్తేరు వీరయ్య విడుదల కానుంది. మెగా ఫ్యాన్స్ ఈ మాస్ మసాలా ఎంటర్టైనర్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వింటేజ్ చిరుని తలపిస్తున్న ఊర మాస్ గెటప్ ఫ్యాన్స్ కి బాగా నచ్చింది. వాల్తేరు వీరయ్య సంక్రాంతి రేసులో విన్నర్ అవుతుందని గట్టిగా నమ్ముతున్నారు. విడుదలకు కొన్ని రోజులు మాత్రం మిగిలి ఉండగా ప్రొమోషన్స్ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. 

వాల్తేరు వీరయ్య ఫస్ట్ సింగిల్ 'బాస్ పార్టీ' సూపర్ హిట్ రెస్పాన్స్ అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో 'బాస్ పార్టీ' సాంగ్ ఊపేస్తోంది. ఊర్వశి రాతెలాతో చిరంజీవి ఎనర్జిటిక్ స్టెప్స్ తో మంట పుట్టించారు. బాస్ పార్టీ వెండితెరపై బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందన్న నమ్మకం ఇచ్చింది. ఇక సెకండ్ సాంగ్ గా రొమాంటిక్ డ్యూయల్ విడుదల చేశారు. చిరంజీవి-శృతి హాసన్ లపై తెరకెక్కించిన 'శ్రీదేవి చిరంజీవి' సాంగ్ నేడు విడుదల చేశారు. 

ఫ్రాన్స్ లో దట్టమైన మంచులో 'శ్రీదేవి చిరంజీవి' సాంగ్ షూట్ చేశారు. ఈ సాంగ్ లో చిరంజీవి, శృతి లుక్స్ ఆకట్టుకున్నాయి. విజువల్స్ అబ్బురపరిచాయి. జస్ప్రీత్ జాస్జ్, సమీరా భరద్వాజ్ ఈ సాంగ్ ఆలపించారు. 'శ్రీదేవి చిరంజీవి' సాంగ్ కి సాహిత్యం దేవిశ్రీ అందించారు. రెండో సాంగ్ సైతం ఏమాత్రం అంచనాలకు తగ్గకుండా ఉంది. 

మైత్రీ మూవీ మేకర్స్ వాల్తేరు వీరయ్య చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవితేజ వాల్తేరు వీరయ్య ఏసీపీగా కీలక రోల్ చేస్తున్నారు. ఆయన ఫస్ట్ లుక్ గ్లిమ్స్ ఆకట్టుకుంది. కె ఎస్ రవీంద్ర అలియా బాబీ దర్శకుడు. వాల్తేరు వీరయ్య మూవీపై పరిశ్రమలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఆచార్య మెగా అభిమానులను నిరాశపరిచింది. గాడ్ ఫాదర్ పూర్తి స్థాయిలో మెప్పించలేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios