Asianet News TeluguAsianet News Telugu

Arjuna Phalguna:ఎన్టీఆర్ పై అభిమానం, జగన్ ప్రభుత్వంపై సెటైర్లు ఆదుకున్నాయా?

. "ఇంటింటికీ వెళ్లి కోటా సరుకులిస్తారు అదేనా" అంటూ వెటకారంగా అడుగుతాడు. దాంతో గ్రామ వాలంటీర్ అంటే అంత చిన్నచూపు ఎందుకంటూ నెటిజన్లు, మరీ ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు శ్రీవిష్ణును ఓ రేంజ్ లో ట్రోల్ చేసారు.  

Sri Vishnu Arjuna Phalguna result
Author
Hyderabad, First Published Jan 1, 2022, 7:20 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

శ్రీవిష్ణు తాజా చిత్రం అర్జున ఫాల్గుణ. తాజాగా ఈ సినిమా  రిలీజైంది. ఇందులో గ్రామ వాలంటీర్ ప్రస్తావన ఉంది. హీరోయిన్ ను ఇంతకీ ఏ ఉద్యోగం అని అడుగుతాడు సైడ్ ఆర్టిస్ట్. దానికి హీరోయిన్ గర్వంగా గ్రామ వాలంటీర్ అని చెబుతుంది. ఆ మాట వినగానే శ్రీవిష్ణు అదో రకంగా ముఖం పెడతాడు. "ఇంటింటికీ వెళ్లి కోటా సరుకులిస్తారు అదేనా" అంటూ వెటకారంగా అడుగుతాడు. దాంతో గ్రామ వాలంటీర్ అంటే అంత చిన్నచూపు ఎందుకంటూ నెటిజన్లు, మరీ ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు శ్రీవిష్ణును ఓ రేంజ్ లో ట్రోల్ చేసారు. అయితే ఇదే ప్లస్ అవుతుంది  థియోటర్ లో అని దర్శక,నిర్మాతలు నమ్మారు. ఆ డైలాగుని తీయటానికి ఇష్టపడలేదు. కానీ సీన్ రివర్స్ అయ్యింది.

వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన హీరో శ్రీవిష్ణు ప్రధాన పాత్ర పోషించిన చిత్రమిది. ఇంతకుముందు ‘జోహార్’ అనే సినిమా తీసిన తేజ మర్ని ఈ సినిమాకు దర్శకుడు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళమ్మాయి అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. గంజాయి స్మగ్లింగ్ అనే క్రైమ్ చుట్టూ నడిచే  డ్రామానే ఈ సినిమా. ప్రోమోలు చూస్తే యాక్షన్, ఎంటర్టైన్మెంట్ బాగానే మిక్స్ చేసినట్లుగా కనిపించి ఉత్సాహపడ్డారు. కానీ థియోటర్ లోకి వెళ్లాక సినిమాలో విషయం లేదని తేలిపోయింది. తెరపై చాలా పాత్రలు కనిపిస్తాయి. కానీ ఒక్క పాత్ర కూడా రిజిస్టర్ అవ్వదు. శ్రీ విష్ణు స్నేహుతుల మధ్య ఫ్రెండ్ షిప్ కూడా ఎమోషనల్ గా కనెక్ట్ చేయలేదు.  ఈ సినిమాతో ఏ అంశాన్ని చెప్పాలనుకున్నారో స్పష్టత లేకుండా పోయింది. దిన్ని కామెడీ అనలేం, సీరియస్ డ్రామా అనలేం, ఎమోషనల్ గా కూడా కనెక్ట్ చేయలేదు.

ఇందులో శ్రీవిష్ణు జూనియర్ ఎన్టీఆర్ అభిమాని పాత్రలో కనిపించడం విశేషం. అయితే ఆ సీన్స్ కూడా డల్ అయ్యిపోయాయి. ప్రోమోలు చూస్తే మంచి కంటెంట్  ఉన్న సినిమాలాగే కనిపించింది.ఎన్టీఆర్ ఫ్యాన్స్, గ్రామ వాలంటీరు ఉద్యోగాలు, ప్రెసిడెంట్ మెడల్ మందు పై సెటైర్లు .. పెద్దగా ఆకట్టుకోలేదు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమాకు అండగా ఉంటారనుకుంటే అదీ జరగలేదు. దానికి తోడు వైసీపీ అభిమానులు ఈ సినిమాపై సోషల్ మీడియాలో ఓ రేంజిలో ఆడేసుకున్నారు. రిలీజ్ అయ్యాక మరీ పెరిగిపోయింది.

Also Read :Arjuna Phalguna Review: అర్జున-ఫల్గుణ మూవీ రివ్యూ.. శ్రీవిష్ణు వన్ మ్యాన్ షో..

కథలో ట్రీట్మెంట్ కూడా పాత వాసనే కొడుతుంది. ఫైనల్ గా అర్జున-ఫల్గుణ మిస్ ఫైర్ డ్రామా నిలిచిపోయింది. తెలంగాణలో టికెట్ల రేట్ల పెంపు కూడా ఈ సినిమాపై కొంత నెగెటివ్ ఇంపాక్ట్ చూపించింది. అయితే సినిమాలో విషయం ఉండి, ఇయర్ ఎండ్ వీకెండ్ కలిసొస్తే సినిమా గట్టెక్కేసును. ఏదైనా ఏడాదిలో చివరి సినిమా 2021 బాక్సాఫీస్‌కు దారుణమైన ముగింపు ఇచ్చింది.

Aso Read :Shyam Singha Roy: 'శ్యామ్ సింగ రాయ్' కి బాలయ్య ప్రశంసలు

Follow Us:
Download App:
  • android
  • ios