శ్రీరెడ్డి జీవితంపై సినిమా.. టైటిల్ 'రెడ్డి డైరీ'!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 21, Aug 2018, 11:00 AM IST
Sri Reddy to act in a biopic on her life
Highlights

టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్ పై సంచలన ఆరోపణలు చేసిన నటి శ్రీరెడ్డి ప్రముఖులను టార్గెట్ చేస్తూ వారు తనను లైంగికంగా వాడుకున్నారంటూ విరుచుకుపడింది

టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్ పై సంచలన ఆరోపణలు చేసిన నటి శ్రీరెడ్డి ప్రముఖులను టార్గెట్ చేస్తూ వారు తనను లైంగికంగా వాడుకున్నారంటూ విరుచుకుపడింది. ఇప్పుడు చెన్నైకి వెళ్లి అక్కడ తారలపై కూడా ఆరోపణలు చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ తో వార్తల్లోకెక్కింది.

దర్శకుడు చిత్రై సెల్వం.. శ్రీరెడ్డి జీవితంపై సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు. 'రెడ్డి డైరీ' అనే పేరుతో ఈ సినిమా రూపొందనున్నట్లు శ్రీరెడ్డి స్వయంగా వెల్లడించింది. ఈ మేరకు ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసిన శ్రీరెడ్డి విలేకరులతోమాట్లాడారు.

''నన్ను మోసగించిన వారు ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు వాటిని బయటపెడతాను. నేను నటించబోయే ఈ సినిమాకు సహకరిస్తామని నడిగర్ సంఘం హామీ ఇచ్చింది. కాస్టింగ్ కౌచ్ పై నా పోరాటం ఆగదు. నా ఆరోపణల జాబితా కొనసాగుతూనే ఉంటుంది. నన్ను లైంగికంగా వేధించిన వారి వీడియో ఆధారాలు నా దగ్గరు ఉన్నాయి. ఈ చిత్రం ద్వారా వాటిని విడుదల చేయాలనుకుంటున్నాను' అంటూ వెల్లడించింది.   

ఇది కూడా చదవండి.. 

పవన్ కి ఇష్టమైన గెటప్.. శ్రీరెడ్డి పోస్ట్ పై ఫ్యాన్స్ ఆగ్రహం!

loader