Asianet News TeluguAsianet News Telugu

శ్రీరామ్ ని సేవ్ చేసిన అవికా గోర్.. చుక్కలు చూపించిన అవినాష్, బాబా భాస్కర్.. మామూలు రచ్చ కాదు

బిగ్ బాస్ సీజన్ 5 దివాళి స్పెషల్ ఎపిసోడ్ లో భాగంగా ఉయ్యాల జంపాల ఫేమ్ అవికా గోర్ డాన్స్ పెర్ఫామెన్స్ తో ఎంట్రీ ఇచ్చింది. పలు హిట్ సాంగ్స్ కి అవికా ఎనర్జిటిక్ స్టెప్పులు అందించింది. 

Sreeram Saved by avika gor and avinash baba bhaskar into the house
Author
Hyderabad, First Published Oct 31, 2021, 8:56 PM IST

బిగ్ బాస్ సీజన్ 5 దివాళి స్పెషల్ ఎపిసోడ్ లో భాగంగా ఉయ్యాల జంపాల ఫేమ్ అవికా గోర్ డాన్స్ పెర్ఫామెన్స్ తో ఎంట్రీ ఇచ్చింది. పలు హిట్ సాంగ్స్ కి అవికా ఎనర్జిటిక్ స్టెప్పులు అందించింది. మునుపటికంటే అవికా బాగా నాజూగ్గా మారింది. జింక పిల్ల తరహాలో హుషారుగా వేదికపై చెంగు చెంగున ఎగురుతూ డాన్స్ చేసింది. 

అనంతరం నాగార్జున అవికాపై ఓ బాధ్యత పెట్టారు. నామినేషన్స్ లో మిగిలి ఉన్న రవి, లోబో, శ్రీరామ్ లలో అవికా ఒకరిని సేవ్ చేయాలి. సుత్తి తీసుకుని బిగ్ బాస్ ఇచ్చిన బాక్స్ ని బ్రేక్ చేయగా అందులో చీటీ ఉంటుంది. ఆ చీటీలో శ్రీరామ్ పేరు ఉంటుంది. దీనితో అవికా శ్రీరామ్ సేవ్ అయినట్లు ప్రకటిస్తుంది. 

అనంతరం అవికా కోసం శ్రీరామ్ ఓ హిందీ సాంగ్ అందంగా పాడి వినిపిస్తాడు. ఇక అవికా తనకు షణ్ముఖ్ అంటే ప్రత్యేకమైన ఇష్టం అని చెబుతుంది. ఇంతలో బిగ్ బాస్ హౌస్ లో సర్ ప్రైజ్.. బిగ్ బాస్ గత సీజన్ల కంటెస్టెంట్స్ బాబా భాస్కర్, ముక్కు అవినాష్ ఎంట్రీ ఇస్తారు. 

ముక్కు అవినాష్, బాబా మాస్టర్ ఇద్దరూ హౌస్ లో ఉన్న ఒక్కో కంటెస్టెంట్ ని ఎంచుకుని వారి గురించి ఫన్నీగా మిమిక్రి చేస్తూ.. వాళ్ళ తరహాలో యాక్టింగ్ చేస్తూ రచ్చ రచ్చ చేశారు. ముఖ్యంగా మానస్, పింకీ లాంటి పైర్స్ ని ఎంచుకుని కామెడీ పంచ్ లతో రెచ్చిపోయారు. ఇతర హౌస్ మేట్స్ లో నవ్వులు పూయించారు. 

అలాగే షణ్ముఖ్, సిరి, మధ్యలో జెస్సి ఎలా ఉంటాడో వివరిస్తూ ఫన్నీగా యాక్టింగ్ చేశారు. సన్నీ గొడవ పెట్టుకునే విధానాన్ని ఫన్నీగా చేసి చూపించారు. కాసేపు బాబా భాస్కర్, అవినాష్ ఇద్దరూ మంచి వినోదం అందించి హౌస్ నుంచి బయటకు వెళ్లారు. కంటెస్టెంట్స్ అందరికి శుభాకాంక్షలు తెలియజేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios