Asianet News TeluguAsianet News Telugu

‘క్రేజీ అంకుల్స్’ ట్రైలర్: శ్రీముఖి, బండ్ల గణేష్ లకే విజిల్స్

ఓ సిని నిర్మాతగా బండ్ల గణేష్ ఈ సినిమాలో కనిపించనున్నారు. తన రియల్ లైఫ్ ని గుర్తు చేస్తూ ఈ డైలాగులు రాసారు. దాంతో అవి అలరిస్తున్నారు. మరో ప్రక్క శ్రీముఖి కూడా గ్లామర్ తో కళకళ్లాడిపోతోంది. ఈ కాంబోలో వచ్చిన ఈ ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి.

Sreemukhi  Raja Ravindra Crazy Uncles official trailer
Author
Hyderabad, First Published Aug 15, 2021, 7:20 AM IST

గుడ్ సినిమా గ్రూప్‌ నిర్మాణంలో క్రేజీ ప్రాజెక్టుగా రూపుదిద్దుకున్న చిత్రం క్రేజీ అంకుల్స్‌. బుల్లితెర బ్యూటీ యాంకర్ శ్రీముఖి ప్రధాన పాత్రలో ఇ. సత్తి బాబు దర్శకత్వంలో ‘క్రేజీ అంకుల్స్’ తెరకెక్కింది. ఈ నెల 19న ఈ సినిమాను విడుద‌ల‌ చేస్తున్నారు. ఈ నేఫద్యంలో చిత్రం ప్రమోషన్స్ మొదలెట్టి ట్రైలర్ విడుదల చేసారు. ఈ ట్రైలర్ లో బండ్ల గణేష్ డైలాగులకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఓ సిని నిర్మాతగా బండ్ల గణేష్ ఈ సినిమాలో కనిపించనున్నారు. తన రియల్ లైఫ్ ని గుర్తు చేస్తూ ఈ డైలాగులు రాసారు. దాంతో అవి అలరిస్తున్నారు. మరో ప్రక్క శ్రీముఖి కూడా గ్లామర్ తో కళకళ్లాడిపోతోంది. ఈ కాంబోలో వచ్చిన ఈ ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి.

ఈ ట్రైలర్ లో ఉన్న కంటెంట్ ని బట్టి చూస్తే...  ఓ అపార్టుమెంటులో ఉండే ఆర్‌,ఆర్‌,ఆర్‌ (రాజు.. రెడ్డి.. రావు) ముగ్గురూ నడి వయస్సు దాటిన వాళ్లు.. తాము వయస్సులో ఉన్నప్పుడు చేయలేకపోయిన చిలిపి పనులు ఇప్పుడు చేద్దామని రంగంలోంకి దూకుతారు. ఈ క్రమంలోనే ఒక అందమైన అమ్మాయి స్వీటీ (శ్రీముఖి) వెంట పడతారు. ఎలాగైనా ఆమెను లైన్లో పెట్టాలని ట్రైల్స్ వేస్తారు. ఆ తర్వాత వాళ్లు ఉండే అపార్టుమెంటులోకే ఆ అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది. అక్కడ నుంచి వీరి ముగ్గరు జీవితాల్లో ఏం జరిగింది. వాళ్ళకు  చెమటలు ఎందుకు పట్టాయి అనేదే మిగతా కథ. 

సత్తిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బుల్లితెర తార శ్రీముఖి ప్రధానపాత్రలో కనిపిస్తుండగా.. క్రేజీ అంకుల్స్‌గా రాజా రవీంద్ర, మనో, భరణి సందడి చేయనున్నారు. ఈ చిత్రం ఆగస్టు 19న థియేటర్లలో విడుదల కానుంది. కాగా.. చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి, గిరిధర్‌, అదుర్స్‌ రఘు, హేమ తదితరులు నటించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios