Asianet News TeluguAsianet News Telugu

శ్రీ విష్ణు 'సామజవరగమన' రిలీజ్ డేట్ ఫిక్స్

 సామజవరగమన యూనిక్ కాన్సెప్ట్‌తో కూడిన పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. చాలా మంది కమెడియన్స్ ఉండటం వల్ల సినిమాలో తగినంత ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందని భరోసా ఇస్తోంది.  

Sree Vishnu #Samajavaragamana planning for May 12th release
Author
First Published Mar 19, 2023, 4:59 PM IST

హిట్టు, ఫ్లాపుతో సంబంధం లేకుండా సినిమాలు చేసే  హీరో శ్రీవిష్ణు. .. విభిన్న తరహా కథాంశాలు ఉన్న సినిమాలు చేస్తూ తెలుగులో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. గతేడాది అల్లూరి   సినిమాతో ముందుకొచ్చిన శ్రీ విష్ణు అది పూర్తిగా నిరాశపడటంతో తన రూట్ మార్చుకున్నాడు. ఇప్పుడు తన బాడీ లాంగ్వేజ్ కు బాగా నప్పే లవ్ స్టోరీతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఆ సినిమానే సామజవరగమన.  

 వివాహ భోజనంబు ఫేం రామ్‌ అబ్బరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.  ప్రతి లవ్ మ్యారేజ్‌లో క్యాస్ట్ ప్లాబ్లం ఉంటుంది లేదా క్యాష్ ప్రాబ్లం ఉంటుంది.. కానీ నా లవ్ స్టోరీలో ఇలాంటి ప్లాబ్లమ్ ఉంటుందా? అంటూ శ్రీవిష్ణు  చెప్పే డైలాగ్ లతో  సినిమా గ్లింప్స్ రిలీజ్ అయ్యి ఆసక్తిని పెంచింది.  ఈ సినిమాలో హీరో లవ్ స్టోరీలో ఏదో చిత్రమైన సమస్య ఉంటుందని అర్థమవుతుంది.  ఈ చిత్రం మే 12 న రిలీజ్ కానుంది. ఈ మేరకు నిర్మాతలు ఏర్పాటు చేస్తున్నారు.

అమాయకుడైన యువకుడి క్యారెక్టర్‌లో శ్రీ విష్ణు బాగా ఒదిగిపోయాడు. రెబా మోనికా ఇందులో హీరోయిన్‌గా చేస్తోంది. తన పర్ఫార్మెన్స్‌తో శ్రీ విష్ణు ఆకట్టుకుంటున్నాడు. స్టోరీని బట్టి చూస్తే ఇది యూనిక్ కంటెంట్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. సామజవరగమన టైటిల్ ఆడియెన్స్‌కు ఇంకా ఆసక్తికరంగా మార్చింది. గోపీసుందర్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తోంది.

  ఈ సినిమాలో బిగిల్‌ ఫేం రెబా మోనికా జాన్‌ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. వెన్నెల కిశోర్‌, నరేశ్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తో కలిసి హాస్య మూవీస్‌ బ్యానర్‌ పై రాజేశ్‌ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాంరెడ్డి కెమెరామెన్‌ కాగా.. గోపీ సుందర్‌ సంగీతం అందిస్తున్నాడు. గతేడాది భళా తందనాన, అల్లూరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు శ్రీవిష్ణు. కొత్త కొత్త కాన్సెప్ట్‌లతో సినిమాలు చేసే శ్రీ విష్ణు మరి ఈ సారి ఎలాంటి జోనర్‌లో సినిమా చేయబోతున్నాడన్న అన్న ఆసక్తి అభిమానుల్లో ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios