Asianet News TeluguAsianet News Telugu

డిఫరెంట్ : ‘తిప్పరా మీసం’ ఫస్ట్ లుక్ ఇదిగో!

‘నీదీ నాదీ ఒకే కథ’ అనే సినిమాతో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నారు శ్రీవిష్ణు. ఆ  సినిమాలోని  శ్రీ విష్ణు నటనకు అద్భుతమైన రివ్యూలు ఇచ్చారు. 

Sree Vishnu's Thipparaa Meesam first look unveiled
Author
Hyderabad, First Published Feb 6, 2019, 10:58 AM IST

‘నీదీ నాదీ ఒకే కథ’ అనే సినిమాతో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నారు శ్రీవిష్ణు. ఆ  సినిమాలోని  శ్రీ విష్ణు నటనకు అద్భుతమైన రివ్యూలు ఇచ్చారు. అప్పట్లో ఒకడుండేవాడు, మెంటల్‌ మదిలో లాంటి డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో సినిమాలు చేస్తూ వస్తోన్న ఈ యువ హీరో రీసెంట్ గా మరో చిత్రాన్ని మొదలుపెట్టారు. ‘తిప్పరా మీసం’ అనే  రూపొందుతున్న ఈ సినిమాకు ‘అసుర’ ఫేం కృష్ణ విజయ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. 

టైటిల్‌కు తగ్గట్టుగా గుబురు గడ్డంతో మాస్‌లుక్‌లోకి మారిపోయారు శ్రీవిష్ణు. కృష్ణవిజయ్.. నారా రోహిత్ తో పాటు శ్రీవిష్ణుకు కూడా మంచి మిత్రుడు. విష్ణు హీరోగా తెరకెక్కిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాకు రోహిత్ తో పాటు కృష్ణవిజయ్ కూడా ఒక నిర్మాత కావడం విశేషం. ‘అసుర’ తర్వాత దర్శకుడిగా చాలా గ్యాప్ తీసుకున్న కృష్ణవిజయ్.. ఇప్పుడు శ్రీవిష్ణును హీరోగా పెట్టి సినిమా తీస్తున్నాడు. దీనికి ‘తిప్పరా మీసం’ టైటిల్ పెట్టడంతో మంచి క్రేజ్ వచ్చింది.   టైటిల్ చూస్తే ఇదేదో మాస్ సినిమాలా ఉందనే అభిప్రాయం వస్తోంది. 

దర్శకుడు విజయ్  మాట్లాడుతూ.. ‘‘అప్పట్లో ఒకడుండేవాడు, నీది నాది ఒకేకథ చిత్రాల తరువాత ఈ సినిమాకు నిర్మాణ భాగస్వామ్యం చేస్తూ దర్శకత్వం వహించడం సంతోషంగా ఉంది.  త్వరలో ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు.

హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. "విజయ్ గారితో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. మిగిలిన చిత్ర యూనిట్ సభ్యులకు అభినందనలు తెలుపుతున్నాను. కొన్ని ఏళ్లుగా మేము కలిసి పనిచేస్తున్నాము. ఈ సినిమా అందరికి నచ్చే సినిమా అవుతుందని నమ్ముతున్నాను" అన్నారు.

నిర్మాత రిజ్వాన్ మాట్లాడుతూ.. "డైరెక్టర్ వచ్చి ఈ కథ చెప్పినప్పుడు కొత్తగా ఫీల్ అయ్యాను. సినిమాను త్వరగా నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాను. కథ చాలా విభిన్నంగా ఉండబోతోంది. ఒక మంచి సినిమాను అందరు ఆదరిస్తారని ఆశిస్తున్నాను" అన్నారు.

రోహిణి, రఘుబాబు, అచ్చుత్ రామారావు, ఏ.ఎస్.రవికుమార్ చౌదరి (డైరెక్టర్), అజయ్ ఘోష్, రవి వర్మ తదితరులు ఇతర నటీనటులు.

Follow Us:
Download App:
  • android
  • ios