వెండితెరపై ప్రపంచ ప్రేక్షకులు ప్రేమను చూసిన హాలీవుడ్ అడ్వెంచర్ మూవీ స్పైడర్ మ్యాన్.. బుల్లి తెర ప్రేక్షకులను కూడా అలరించడానికి రెడీ అయ్యింది. త్వరలో ప్రతీ ఇంట్లో సందడి చేయబోతుంది. 

హాలవుడ్ టాప్ యాక్టర్ టామ్ హాలండ్ హీరోగా న‌టించిన లేటెస్ట్ హాలీవుడ్ మూవీ స్పైడ‌ర్ మ్యాన్ నో వే హోమ్‌. ప్రపంచ సినిమా ప్రేమికులను ఎంతగానో అలరింరచిన ఈమూవీ గ‌తేడాది డిసెంబ‌ర్ 16న యూఎస్ కంటే ఒక రోజుమందే ఇండియాలో రిలీజ్ అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లను సాధించిన ఈ సినిమా.. మొద‌టి నుంచే ఈ సినిమాపై ప్రేక్ష‌కుల‌లో భారీ అంచ‌నాలను పెంచుకుంటూ వచ్చింది. 

ఆ అంచనాల‌కు త‌గ్గ‌ట్టే సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టింది. ఇప్ప‌టివ‌ర‌కు స్పైడ‌ర్ మ్యాన్ సిరీస్‌లో వ‌చ్చిన క‌థ‌ల‌ను, క్యారెక్ట‌ర్ల‌ను క‌నెక్ట్ చేస్తూ ఒక సినిమాగా తీయ‌డమ‌నేది సినీ చ‌రిత్ర‌లోనే లేదు. ఈ విష‌యంలో జాన్‌వాట్ ఫుల్ స‌క్సెస్ అయ్యాడు. జాన్ వాట్ త‌న ద‌ర్శ‌క‌త్వ ప్రతిభతో వరల్డ్ ఆడియన్స్ ను  థియేటర్ల‌లో క‌ట్టిప‌డేసాడు. ప్ర‌తి క్యారెక్ట‌ర్‌కు ఒక‌ జ‌స్టిఫికేష‌న్ ఇచ్చాడు.

ఇండియాలో స్పైడ‌ర్ మ్యాన్ నో వే హోమ్‌ దాదాపుగా  200 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. 170 కోట్ల డాల‌ర్ల గ్రాస్‌ను క‌లెక్ట్ చేసి 5వ హైయెస్ట్ మూవీగా స్పైడ‌ర్ మ్యాన్ నిలిచింది. సిల్వర్ స్క్రీన్ పై ఇంతలా సందడి చేసిన ఈ సినిమా ఇక ఓటీటీ రిలీజ్ కు ముస్తాబవుతుంది. మార్చి 23నుంచి స్పైడ‌ర్ మ్యాన్ బుక్ మై షో ప్లాట్ ఫార్మ్‌లో స్ట్రీమింగ్ కానుంది.టామ్ హాలండ్ నటించిన స్పైడ‌ర్‌ మ్యాన్‌ సిరీస్‌ల‌లో ఇది బెస్ట్ మూవీ అని అనిపించుకుంది. అవేంజ‌ర్స్ ఎండ్ గేమ్ త‌ర్వాత ఆ స్థాయిలో ఆక‌ట్టుకున్న సూప‌ర్ హీరో ఫిలిం కూడా ఇదే.