Asianet News TeluguAsianet News Telugu

వినూత్నంగా బాలయ్య బర్త్‌డే వేడుకలు.. జగన్‌ నిర్ణయం

కరోనా కారణంగా ప్రజలు ఒకే చోట గుమిగూడే పరిస్థితి లేదు. దీంతో అభిమానులు ఈ సారి బాలయ్య బర్త్‌ డే వేడుకలను వినూత్నంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు ఎన్‌బీకే హెల్పింగ్‌ హ్యాండ్స్‌ సంస్థ నిర్వాహకుడు జగన్‌ అభిమానులకు పిలుపునిచ్చారు.

Special Plan For Nandamuri Balakrishna Birthday Celebrations
Author
Hyderabad, First Published Jun 8, 2020, 3:19 PM IST

లాక్‌ డౌన్ కారణంగా సినీ కార్యక్రమాలు లేకపోవటంతో అభిమానుల్లో నిరుత్సాహం అలుముకుంది. దీనికి తోడు తమ అభిమాన తారల పుట్టిన రోజు కూడా లాక్‌ డౌన్ సమయంలో రావటంతో చాలా మంది హీరోల ఫ్యాన్స్ ఘనంగా వేడుకలు నిర్వహించలేకపోతున్నారు. ఈ నెల 10న నందమూరి నటసింహం బాలకృష్ణ పుట్టిన రోజు. ప్రతీ ఏటా ఈ రోజును ఓ పండుగలా నిర్వహిస్తారు నందమూరి అభిమానులు.

అయితే ఈ సారి అలాంటి పరిస్థితులు లేవు. కరోనా కారణంగా ప్రజలు ఒకే చోట గుమిగూడే పరిస్థితి లేదు. దీంతో అభిమానులు ఈ సారి బాలయ్య బర్త్‌ డే వేడుకలను వినూత్నంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు ఎన్‌బీకే హెల్పింగ్‌ హ్యాండ్స్‌ సంస్థ నిర్వాహకుడు జగన్‌ అభిమానులకు పిలుపునిచ్చారు. ప్రతీ సంవత్సరం నిర్వహించినట్టుగా కాకుండా ఈ సారి జూన్‌ 10న సరిగ్గా ఉదయం 10 గంటల 10 నిమిషాలకు ప్రతీ అభిమాని తన ఇంట్లో కేక్‌ చేసిన బాలకృష్ణ బర్త్‌డే సెలబ్రేట్ చేయాలని కోరాడు.

ప్రస్తుతం ఉన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో సామాజిక బాధ్యతతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా వెల్లడించాడు జగన్‌. అంతేకాదు కరోనాపై పోరులో ముందు వరుసలో పనిచేస్తున్న డాక్టర్లు, పోలీసులు, శానిటేషన్ కార్మికులు, మీడియా వారు ఇలా అన్ని రంగాల వారిని తలుచుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించాలని ఆయన కోరారు. నందమూరి బాలకృష్ణ ఈ నెల 10న తన 60 వ పుట్టిన రోజు జరుపుకోబోతున్నారు. షష్టి పూర్తి సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios