Asianet News TeluguAsianet News Telugu

#SPB:ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం తొలగింపు ,వివాదం


ఎస్పీ బాలు విగ్రహం ఏర్పాటుకు అనుమతి కోరుతూ రెండేళ్లుగా అధికారులకు దరఖాస్తు చేశామని.. అధికారుల చుట్టూ తిరిగామని కళాదర్బార్‌ సభ్యులు అంటున్నారు. విగ్రహం ఏర్పాటు చేస్తే ఎందుకు తొలగించారని..  

Sp balasubrahmanyam statuee removed by Guntur corporation
Author
First Published Oct 4, 2022, 12:35 PM IST


గుంటూరులో ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం విగ్రహం తొలగింపుపై దుమారం రేగుతోంది. నగరంలోని మదర్‌ థెరీసా కూడలిలో కళా దర్బార్‌ అధ్వర్యంలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ విగ్రహానికి అనుమతి లేదంటూ నగరపాలక సంస్థ అధికారులు తొలగించేశారు. ఈ ఘటనతో కార్పొరేషన్‌ అధికారులపై కళాకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ విగ్రహాన్ని ఎస్పీబీ అభిమానులు ఏర్పాటు చేశారు. అయితే, విగ్రహ ప్రతిష్టాపనకు అనుమతులు లేవంటూ విగ్రహం ప్రతిష్టించిన మరునాడే ఈ విగ్రహాన్ని నగర పాలక సంస్థ అధికారులు తొలగించారు. జిల్లా కలెక్టర్‌, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి తెలియజేసే, ఆదివారం రాత్రి మిత్రుల సహకారంతో విగ్రహాన్ని లక్ష్మీపురం సెంటర్‌లోని మదర్‌ థెరెస్సా కూడలికి చేర్చామని కళాదర్బార్‌ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు పొత్తూరి రంగారావు చెప్పారు. సోమవారం ఉదయం వెళ్లిచూడగా అక్కడి నుంచి తొలగించి, నగరపాలిక వాటర్‌ ట్యాంకర్ల ప్రాంగణంలో పడేశారని వాపోయారు. 

ఎస్పీ బాలు విగ్రహం ఏర్పాటుకు అనుమతి కోరుతూ రెండేళ్లుగా అధికారులకు దరఖాస్తు చేశామని.. అధికారుల చుట్టూ తిరిగామని కళాదర్బార్‌ సభ్యులు అంటున్నారు. విగ్రహం ఏర్పాటు చేస్తే ఎందుకు తొలగించారని.. మహా గాయకుడికి కార్పొరేషన్‌ అధికారులు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు చేసింది కేవలం గుంటూరు లోనేనని గుర్తు చేశారు. గుంటూరులో దాదాపు 200పైగా అనుమతి లేని విగ్రహాలున్నాయని.. వాటి సంగతి ఏంటని ప్రశ్నించారు. వెంటనే అధికారులు బాలు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.
 
'విగ్రహం తొలగించవద్దంటూ అక్కడున్నవారు ప్రాధేయపడినా అధికారులు విన్లేదు. నగరంలో ట్రాఫిక్‌ రద్దీగా ఉండే డివైడర్లు, కూడళ్లల్లో నేతల విగ్రహాలను కొనసాగిస్తూ, బాలు విగ్రహాన్ని తొలగించడమేంటి? రాకపోకలకు అడ్డుగా లేనిచోటే పెట్టాం. ఇంకా ముసుగు తొలగించలేదు. అనుమతి కోసం మేం రెండేళ్లుగా తిరుగుతున్నా, అధికారులు స్పందించలేదు' అని రంగారావు వాపోయారు. 

దీనిపై కార్పొరేషన్‌ ప్రణాళికాధికారి జీఎస్‌ఎన్‌ మూర్తి మాట్లాడుతూ 'కోర్టుల ఆదేశాల మేరకు ప్రధాన కూడళ్లు, రహదారుల్లో విగ్రహాలు ఏర్పాటు చేయకూడదు. బాలు విగ్రహం పెట్టిన ప్రదేశం నిత్యం ట్రాఫిక్‌తో రద్దీగా ఉంటుంది. దానికి అనుమతి లేనందునే తొలగించామ'ని ఆయన తెలిపారు. 

రాకపోకలకు అడ్డుగా లేనిచోటే విగ్రహాన్ని పెట్టామని.. ఎస్పీ బాలు విగ్రహాన్ని తొలగించడమేంటని ప్రశ్నించారు. ఇంకా ముసుగు తొలగించలేదని.. అనుమతి కోసం మేం రెండేళ్లుగా తిరుగుతున్నామన్నారు. కోర్టుల ఆదేశాల మేరకు ప్రధాన కూడళ్లు, రహదారుల్లో విగ్రహాలు ఏర్పాటు చేయకూడదు అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios