లెజెండరీ సింగర్‌ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కొద్ది రోజులుగా కరోనాతో పోరాడుతూ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించటంతో కుటుంబ సభ్యులతో పాటు అభిమానుల్లోనూ ఆందోళన నెలకొంది. వారం రోజుల పాటు తీవ్ర విషయంగా ఉన్న ఆయన ఆరోగ్యంగా ఇటీవల కుదుట పడుతోంది. గత నాలుగు రోజులుగా ఆయన ఆరోగ్యంగా నిలకడ ఉన్నట్టుగా ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు చరణ్ వీడియో మెసేజ్‌ రూపంలో విడుదల చేశారు. `నాన్న ఆరోగ్యం గత నాలుగు రోజులుగా నిలకడగా ఉంది. చాలా మంచి సూచన. ఆసుపత్రి వర్గాలు ఆయన ఆరోగ్యపరిస్థితి పట్ల చాలా సాటిస్ఫాక్షన్‌తో ఉన్నారు. కొద్ది రోజుల్లోనే దాదాపు సోమవారం వరకు గుడ్‌ న్యూస్‌ రావచ్చు` అంటూ చెప్పారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#spb Health update 3/9/20 #mgmhealthcare

A post shared by S. P. Charan/Producer/Director (@spbcharan) on Sep 3, 2020 at 3:47am PDT

దీంతో అభిమానుల్లోనూ హర్షం వ్యక్తమవుతోంది. ఇన్నాళ్లు ఆరోగ్యపరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన అభిమానులు ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నారు. తమ అభిమాన గాయకుడు త్వరలోనే ఆరోగ్యంగా ఇంటికి తిరిగి రావటం ఖాయం అంటున్న నమ్మకంతో ఉన్నారు.