Asianet News TeluguAsianet News Telugu

భరించలేకపోతున్న బాలీవుడ్ జనాలు, హాలీవుడ్ నుంచి సీన్స్ కాపీ కొట్టాడంటూ.. రాజమౌళిపై దారుణంగా ట్వీట్స్..

సౌత్ సినిమాలపై విషం చిమ్మడం ఆపడంలేదు నార్త్ జనాలు. బాలీవుడ్ డౌన్ అవ్వడం.. సౌత్ సినిమాలు సత్తా చాటుతుండటంతో.. వారికి అది మిగుడు పడటంలేదు. సౌత్ సినిమాకు..ముఖ్యంగా.. తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన రాజమౌళిపై అక్కసు వెళ్ళగగ్గుతున్నారు. 
 

South Star Director Rajamouli copied scenes from Hollywood
Author
First Published Sep 4, 2022, 9:37 AM IST

సౌత్ సూపర్ స్టార్లు రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలుగా స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్. ఇండియన్ బిగెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలలో ఒకటిగా ట్రిపుల్ ఆర్ రికార్డ్ సాధించింది. ఇక ఈ సినిమా తరువాత రాజమౌళి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో మరో పాన్ ఇండియా సినిమాను తెరకెక్కించబోతున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం బ్రహ్మాస్త్రం సినిమాను సౌత్ లో సమర్పకుడిగా ఉన్నాడు రాజమౌళి. ఈ క్రమంలోనే జక్కన్న సినిమాలపై అక్కసు వెళ్లగగ్గుతున్నారు నార్త్ ఆడియన్స్. 

సౌత్ ఫిల్మ్ మేకర్  గా రాజమౌళి గత దశాబ్ద కాలంగా.. తనకంటూ ఒక ఇమేజ్  తెచ్చుకున్నాడు. అంతకు ముందు కూడా రాజమౌళి వరుస హిట్ సినిమాలు అందించినా.. బాహుబలి లాంటి పాన్ ఇండియా సినిమా తరువాత ఆయన తో పాటు టాలీవుడ్ ఖ్యాతి కూడా విశ్వవ్యాప్తం అయ్యింది.  అప్పటి నుండి ఇది భారీ బడ్జెట్ తో..  గొప్ప కథాంశం, ఉత్కంఠభరితమైన విజువల్స్ మరియు భారీ బాక్సాఫీస్ కలెక్షన్స్ కు ఆయన కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు. 

రాజమౌళి సినిమాలపై బాలీవుడ్ తో పాటు.. హాలీవుడ్ నుంచి కూడా వరుసగా ప్రశంసలు దక్కాయి. జక్కన్న సౌత్ సినిమాను పైకి లేపుతున్న క్రమంలోనే.. ఆటోమాటిక్ గా బాలీవుడ్ సినిమా డౌన్ అయిపోయింది.ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా అనే వరకూ వచ్చింది. దాంతో బాలీవుడ్ లో ఒక వర్గం జనాలు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎలాగైనా సౌత్ సినిమాను ఇబ్బందుల్లోకి నెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. కొంత మంది నెటిజన్లు ఎప్పుడూ అదే పనిలో ఉంటున్నారు. 

 

 

బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటిసినిమాలతో ఇండియన్ సినిమాను గర్వంగా ప్రపంచం ముందు నిలబెట్టిన దర్శకుడిగా రాజమౌళికి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. వాటిని తట్టుకోలేని కొంత మంది బాలీవుడు జనాలు ఆయనపై బురద జల్లే ప్రయత్నం స్టార్ట్ చేశారు. జక్కన్న హాలీవుడ్ నుంచి సినిమాలు కాపీ కొడతారని, సీన్ టూ సీన్ కాపీ కొట్టి తీసినవే అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంకొంత మంది ఇంకా శృతి మించి.. రాజమౌళి పక్కా కాపీ మాస్టర్ అనగా.. ఇంకొకరు అందుకే ఈ సౌత్ షిట్ ను చూడనూ అంటూ.. సౌత్ సినిమాలను షిట్ తో పోలుస్తూ పోస్ట్ లు పెట్టారు. 

 

అంతే కాదు హాలీవుడ్ సీన్స్ లో రాజమౌళి కాఫీ కొట్టాడు అనబడే కొన్ని సన్నివేశాలకు సబంధించి క్లిప్ లను వారు పంచుకున్నారు. దాదాపు 30 కి పైగా సన్నీవేశాలను హాలవుడ్ నుంచి కాఫీ కొట్టినవంటూ.. వారు ప్రత్యేకమైన వీడియోలను ట్విట్టర్ లో పంచకుున్నారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వరల్ అవుతున్నాయి. వీటిని సపోర్ట్ చేస్తూ.. కొంత మంది ఈ వీడియోలు శేర్ చేస్తుండగా.. మరికొంత మంది.. ఈ విమర్షలను కొట్టి పారేస్తున్నారు.. ఇటువంటి పద్దతి మంచిది కాదంటూ కామెంట్లు పెడుతున్నారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios