సుశాంత్ ఆత్మహత్య వ్యవహారం బాలీవుడ్‌ లో స్టార్ వారసులకు తలనొప్పిగా మారింది. నెటిజెన్లు సుశాంత్ మృతికి నెపోటిజమే కారణమంటూ ట్వీట్లు చేస్తున్నారు. దీంతో నెటిజెన్ల గోల భరించలేక సెలబ్రిటీలు సోషల్‌ మీడియా నుంచి వైదొలుగుతున్నారు.

సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య వ్యవహారం స్టార్ వారసుల మెడకు చుట్టుకుంటోంది. బాలీవుడ్‌లో స్టార్ వారసుల కారణంగా డైరెక్ట్‌గా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న టాక్ వినిపిస్తోంది. అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా నెపోటిజంపై గళమెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమమే జరుగుతోంది.

కొంత మంది సినీ అభిమానులు స్టార్ వారసుల సోషల్ మీడియా అకౌంట్స్‌ ను అన్‌ఫాలో చేస్తుంటే, మరికొందరు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. దీంతో వారసులుగా పరిచయం అయిన తారలు ఘాటుగా స్పందిస్తున్నారు. ఇప్పటికే కపూర్‌ ఫ్యామిలీ వారసురాలు సోనమ్ కపూర్‌ తనపై, తన కుటుంబంపై వస్తున్న విమర్శలపై రియాక్ట్ అయ్యింది. తన తండ్రి ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారని వారిని ఈ వయసులో ఇబ్బంది పెట్టే అవకావం ఇవ్వనని తన సోషల్ మీడియా పేజ్‌లో కామెంట్స్‌ను డిజెబుల్‌ చేసింది.

తాజాగా మరో స్టార్ వారసురాలు సోనాక్షి కూడా స్పందించింది. శతృఘ్న సిన్హా వారసురాలిగా పరిచయం అయిన ఈ బ్యూటీపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజెన్లు. దీంతో సోనాక్షి ట్విటర్‌కు గుడ్‌ బై చెప్పేసింది. `కొందరు తాము ఏదో సాధించినట్టుగా సంబరాలు చేసుకుంటున్నారు. నేను కూడా దానికి సంతోషిస్తాను. మీరు చేయాలనుకున్నది చేస్తున్నారు. మీరు చేసే పని ఎవరికి లాభం లేదు, నష్టం కూడా లేదు. ఇక మీరు చేసే డైరెక్ట్‌ కామెంట్స్‌కు, కారణమైన నా ట్విటర్‌ అకౌంట్‌ డీయాక్టివేట్‌ చేశాను` అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో పోస్ట్‌ చేసింది.

View post on Instagram