దర్శక నిర్మాత కరణ్ జోహార్ ని ఓ నెటిజన్ అడగకూడని ప్రశ్న అడిగారు. సదరు ప్రశ్నకు కరణ్ చాలా కూల్ గా షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు.  

స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ వ్యక్తిగత జీవితంపై అనేక అపోహలున్నాయి. కరణ్ జోహార్ వివాహం చేసుకోలేదు. అయితే ఆయన సరోగసీ పద్ధతి ద్వారా ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు. కొడుకు పేరు యష్ కాగా కూతురు పేరు రూహి. ఈ పిల్లల తల్లి ఎవరు అనేది తెలియదు. కరణ్ జోహార్ ఎందుకు పెళ్లి చేసుకోలేదు? దాని కారణం ఏమిటనే సందేహాలు ఉన్నాయి. 

తాజాగా కరణ్ జోహార్ అభిమానులతో ఆన్లైన్ చిట్ చాట్ చేశారు. ఓ నెటిజన్ మీరు గే(స్వలింగ సంపర్కుల)నా? అని అడిగారు. సదరు ప్రశ్నకు ఏమాత్రం తడుముకోకుండా కరణ్ జోహార్ కూల్ గా ఆన్సర్ చెప్పాడు. 'నీకు ఇంట్రెస్ట్ ఉందా?' అని సమాధానం ఇచ్చాడు. తాను గేనా కాదా? అనే విషయం చెప్పకుండా నీకు ఆసక్తి ఉందా అని అడగడంతో సదరు నెటిజెన్ కి ఫ్యూజులు ఎగిరిపోయాయి. సాధారణంగా ఇలాంటి ప్రశ్నలు సెలెబ్రిటీలు అవైడ్ చేస్తారు. కరణ్ మాత్రం చాలా సింపుల్ గా తీసుకున్నారు 

కరణ్ జోహార్ స్టార్ హోస్ట్. అతనికి సెన్సాఫ్ హ్యూమర్ చాలా ఎక్కువ. అందుకే నెటిజన్ కి తన మార్క్ ఆన్సర్ ఇచ్చారు. ధర్మ ప్రొడక్షన్స్ పేరుతో కరణ్ జోహార్ చిత్రాలు నిర్మిస్తున్నారు. బాహుబలి చిత్రాలను ఆయన హిందీలో విడుదల చేశారు. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన లైగర్ చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. రన్బీర్ కపూర్-అలియా భట్ ల బ్రహ్మాస్త్ర చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసింది ఆయనే. దీనికి పార్ట్ 2 కూడా ఉంది. మొదటి భాగంతో నష్టాలు మిగిలిన నేపథ్యంలో పార్ట్ 2 సంగతి వదిలేశారని సమాచారం.