చీకట్లో...నా గర్ల్ ప్రెండ్ తల్లిని చూసి...ఆమే అనుకుని
అంతా చీకటిగా ఉండటంతో అసలేమీ కనిపించలేదు. నా పక్కన ఉంది ప్రేయసే అనుకుని ఏదేదో ఊహించుకున్నాను.
![Sohail Khan Says He Once Hid With His Ex GF Mom in Same Wardrobe jsp Sohail Khan Says He Once Hid With His Ex GF Mom in Same Wardrobe jsp](https://static-ai.asianetnews.com/images/01gnvj7vavhk472h2c9f3pcarx/salman-khan-family-4_363x203xt.jpg)
కొన్ని సంఘటనలు ఆశ్చర్యంగా ఉంటాయి. అందులో నిజా నిజాలు ఎవరికీ తెలియదు కాబట్టి నమ్మాల్సి ఉంటుంది. సెలబ్రెటీలు తమ క్రేజ్ కోసం చెప్పే కబుర్లు వైరల్ అవుతూంటాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో ఓపెన్ టాక్ ఎక్కువైంది. స్టార్స్ మాట్లాడే ప్రతీ మాటా వైరల్ అవుతోంది. దాంతో మాజీ స్టార్స్ తమను జనం గుర్తు చేసుకునేందుకు అన్నట్లు రెచ్చిపోతున్నారు. ఆ క్రమంలో సల్మాన్ సోదరుడు,నటుడు డైరక్టర్ సొహైల్ ఖాన్ చేసి కామెంట్స్ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారాయి.
సోహైల్ ఖాన్ తాజాగా ఓ పాడ్‌క్యాస్ట్‌లో మాజీ ప్రేయసి ఇంట్లో జరిగిన ఓ ఫన్నీ సంఘటనను షేర్ చేసుకున్నాడు. సోహైల్ మాట్లాడుతూ... 'ఓ సారి నా లవర్ (ప్రస్తుతం మాజీ గర్ల్‌ఫ్రెండ్) ఇంట్లో మేమంతా దాగుడుమూతలు ఆడాము. నేను వెళ్లి వార్డ్‌రోబ్‌లో దాక్కున్నాను. అప్పుడే మరొకరు అదే వార్డ్ రోబ్‌లో దూరారు. నా గర్ల్‌ఫ్రెండ్ వచ్చిందేమో అనుకున్నాను.
అంతా చీకటిగా ఉండటంతో అసలేమీ కనిపించలేదు. నా పక్కన ఉంది ప్రేయసే అనుకుని ఏదేదో ఊహించుకున్నాను. కట్ చేస్తే లైట్లు ఆన్ చేశారు. అందరూ బయటకు వచ్చారు. గేమ్ అయిపోయింది.. ఇంకా ఎందుకు దాక్కున్నారు? అని అడిగారు. అప్పుడు కానీ నాతో ఉన్నది ప్రియురాలి తల్లి అని అర్థం కాలేదు' అంటూ నవ్వేశాడు.
ఇక సీమా కిరణ్‌తో విడాకుల గురించి మాట్లాడుతూ.. 'ప్రతిదానికి ఎక్స్‌పైరీ ఉంటుంది. చాక్లెట్, మెడిసిన్, ఫుడ్.. ఇలా అన్నీ ఏదో ఒకరోజు పాడైపోయేవే. సంతోషంగా ఉన్నన్నాళ్లూ వైవాహిక బంధం బాగానే ఉంటుంది. కానీ ఒక్కసారి ఇద్దరి మధ్య నెగెటివ్ ఎనర్జీ వచ్చిందా? అది అంత ఈజీగా పోదు. గొడవలు పడుతూ ఉండే కంటే విడిపోవడమే మంచిది అని చెప్పుకొచ్చాడు. 1998లో సీమాను పెళ్లాడిన ఇతడు 2022లో విడాకులు తీసుకున్నాడు.