Asianet News TeluguAsianet News Telugu

వేశ్య పాత్రలో 'గూఢచారి' బ్యూటీ!

లిప్ లాక్స్, బోల్డ్ క్యారెక్టర్లలో నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని తన మొదటి సినిమా ద్వారా చెప్పకనే చెప్పింది ఈ మాజీ మిస్ ఇండియా. దీంతో దర్శకనిర్మాతలు కూడా ఆమెను సినిమాల్లో తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు

Sobhita Dhulipala To Play A Sex Worker In Her Next
Author
Hyderabad, First Published Aug 16, 2018, 2:37 PM IST

ఫ్యాషన్ బ్యాక్ డ్రాప్ నుండి వచ్చిన తెలుగమ్మాయి శోభిత దూళిపాళ్ల తెలుగులో 'గూఢచారి' చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది. మొదటి సినిమానే సక్సెస్ కావడంతో నటిగా ఆమెకు మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. లిప్ లాక్స్, బోల్డ్ క్యారెక్టర్లలో నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని తన మొదటి సినిమా ద్వారా చెప్పకనే చెప్పింది ఈ మాజీ మిస్ ఇండియా. దీంతో దర్శకనిర్మాతలు కూడా ఆమెను సినిమాల్లో తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.

ప్రస్తుతం శోభిత మలయాళంలో 'మూతోన్' అనే సినిమాలో నటిస్తోంది. మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో హీరోగా స్టార్ హీరో నివిన్ పౌలి నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో శోభిత ఓ వేశ్య పాత్రలో కనిపించనుందట.

సెక్స్ వర్కర్ పాత్రలో నటించడం ఛాలెంజింగ్ గా ఉంటుందని అందుకే ఈ పాత్ర అంగీకరించానని చెబుతోంది ఈ బ్యూటీ. కెరీర్ ఆరంభంలోనే ఇటువంటి పాత్రలో నటించడానికి సిద్ధమై శోభిత పెద్ద సాహసం చేస్తోందనే చెప్పాలి. మరి వేశ్యగా ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి!
 

Follow Us:
Download App:
  • android
  • ios