Asianet News TeluguAsianet News Telugu

కన్నడ హీరో దర్శన్ నోటి దురుసు.. చెప్పుతో దాడి చేసిన వ్యక్తి, హీరో శివరాజ్ కుమార్ ఏమన్నాడంటే..?

ఎంతటి స్టార్ హీరోలు అయినా.. అప్పుడప్పుడు ఏదొ ఒక సమస్యల్లో ఇరుక్కొక తప్పుదు. స్టార హీరోలం కదా అని ఏడిపడితే అది మాట్లాడితే.. రియాక్షన్ ఊహించని లేవల్లో ఉంటుంది. కన్నడ స్టార్ హీరో దర్శన్ ప్రస్తుతం ఇదే పరిస్థితిని ఫేస్ చేస్తున్నారు. 

Slipper thrown at Kannada actor Darshan for his sexist remarks
Author
First Published Dec 19, 2022, 5:45 PM IST

హీరోలం కదా అని ఏది పడితే అది మాట్లాడకూండదు.. ఏం అవుతుందిలే అని పిచ్చి పిచ్చిగా మాట్లాడితే.. రియాక్షన్ ఆడియన్స్ నుంచి ఓ రేంజ్ లో ఉంటుంది. కన్నడ హీరో  దర్శన్ పరిస్థితి కూడా ప్రస్తుతం అలాగే ఉంది. దర్శన్ తన ప్రస్తుత సినిమా క్రాంతిని  ప్రమోట్ చేసుకునే హడావిడిలో ఉన్నాడు. ఈ సినిమా జనవరి 26న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది.ఈక్రమంలోనే ఆయనపై చెప్పుతో దాడి జరిగింది. డిసెంబర్ 18 ఆదివారం  కర్ణాటకలోని హోసపేటలో జరిగిన ఓ  ప్రమోషన్ ఈవెంట్ లో ఆయన పాల్గొన్నారు. 

ఇక అదే టైమ్ లో ఒకతను దర్శన్‌పై తన చెప్పు విసిరాడు. క్రాంతి మూవీలోని ఓ పాటను రిలీజ్ చేస్తున్న క్రమంలో ఈ సినిమాలో నటించిన నటి రచితా రామ్ తన ప్రసంగం చేస్తున్నప్పుడు, ఒక వ్యక్తి దర్శన్‌పై చెప్పు విసిరాడు, అది అతని భుజాలకు తగిలింది. వెంటనే స్పందించిన దర్శన్. ప్రశాంతంగా ఉండాలని..ఇందులో అతని తప్పులేదంటూ.. వాతావరణం సర్ధుమణిగేలా ప్రయ్నం చేశాడు. అయితే ఈ చెప్పుదాడికి కారణం.. దర్శన్ చేసిన వ్యాఖ్యలే అని తెలుస్తోంది. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో  ఛాలెంజింగ్ స్టార్ అని ముద్దుగా పిలుచుకునే నటుడు దర్శన్. 

 

ఇటీవల ఆయన అదృష్ట దేవంతపై  అనుచిత వ్యాఖ్యలు చేశారు.  బహుశా అదృష్ట దేవతపై ఆయన చేసిన  వ్యాఖ్య వల్ల ఈ దాడిజరిగి ఉండవచ్చు అనుకుంటున్నారు.  ఇక వెంటనే ఈ విషయంపై కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ స్పందిచారు.  ఒక వీడియో సందేశాన్ని విడుదల చేసి, చర్యను ఖండించారు. ఇలాంటి చర్యలకు ప్రజలు దూరంగా ఉండాలని కోరారు.కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ తో పాటు  ధన్వీర, రాజవర్ధన్‌ లాంటి పలువురు స్టార్లు  సోషల్ మీడియా ద్వారా దాడిని ఖండించారు.

 

రీసెంట్ గా  ఒక ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, దర్శన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అదృష్ట దేవత ఎప్పుడూ తలుపు తట్టదు. ఆమె తట్టినప్పుడు, ఆమెను పట్టుకుని, మీ బెడ్‌రూమ్‌లోకి లాగి, వివస్త్రను చేయండి. మీరు ఆమెకు బట్టలు ఇస్తేనే అవి వేసుకుని ఆమె బయటకు వెళ్తుంది అంటూ నోటి దురుసు మాటలు మాట్లాడాడు. దీంతో సోషల్ మీడియలో దర్శన్ పై దుమ్మెత్తిపోస్తున్నారు. 

 

చాలా మంది ట్విట్టర్‌లో అతని  ప్రవర్తనను ఖండిస్తున్నారు. అంతే కాదు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ప్రస్తుతం ఈ వివాదం కన్నడ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. దర్శన్  క్రాంతి జనవరి 26న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి వి హరికృష్ణ రచన మరియు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రవిచంద్రన్, సుమలత కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ వివాదం ప్రభావం సినిమాపై పడే అవకాశం కనిపిస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios