Asianet News TeluguAsianet News Telugu

స్టార్ హీరోలకు షాక్ ఇచ్చిన శివ కార్తికేయన్, మంచి మనసు చాటుకున్న యంగ్ హీరో

ఇండస్ట్రీలో ఉన్నహీరోలంతా.. రీల్ హీరోలు మాత్రమే కాదు.. రియల్ హీరోలు కూడా అనిపించకుంటున్నారు కొంత మంది. వాళ్లు చేసే పనులే వారిని బయట కూడా హీరోలుగా నిలబెడుతుంది. తాజాగా తమిళ యంగ్ స్టార్ శివకార్తికేయన్  తాను కూడా రియల్ హీరో అనిపించుకున్నాడు.ఇంతకీ ఏంచేశారు. 

Sivakarthikeyan gave up remuneration producers who in trouble  JMS
Author
First Published Dec 29, 2023, 12:31 PM IST


కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో నేచురల్ స్టార్ నాని ఎలాగో.. తమిళంలో శివకార్తికేయన్ కూడా అక్కడ నెచురల్ స్టార్ అని బిరుదు సాధించాడు. శివకార్తికేయన్  పేరుకి తమిళ హీరో అయినా... ఇటు  తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ సంపాదించుకున్నాడు. యంగ్ స్టార్ నటించిన  రెమో, డాన్, డాక్టర్ వరుణ్  సినిమాలు ఇక్కడ కూడా మంచి సక్సెస్ అందుకున్నాయి. ఈసినిమాలతో టాలీవుడ్ లో కూడా యంగ్ స్టార్ కు మంచి మార్కెట్ ఏర్పడింది. 

 రేడియో జాకీ గా కెరీర్ స్టార్ట్ చేసి.. స్టార్ హీరోగా ఎదిగాడు శివకార్తికేయన్. ఇండస్ట్రీలో ఎలాంటి వారసత్వం లేకుండా. ఇండస్ట్రీలోకి వచ్చి ఎంతో మందికి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచాడు. అయితే ప్రస్తుతం ఉన్న హీరోలలో మంచి రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోలలో  శివ కార్తికేయన్ కూడా ఒకరు.  తాజాగా శివ కార్తికేయన్ కు సంబంధించిన ఓ వార్త కోలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ మారింది.  ఈహీరో  చేసిన పనికి ఇండస్ట్రీలో స్టార్ హీరోలు సైతం షాక్ అవుతున్నారు. సహజంగా సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు సినిమాలతో సంబంధం లేకుండా రెమ్యునరేషన్ భారీగా పుచ్చుకుంటారు. ఆ సినిమా హిట్ అయినా.. ప్లాప్ అయినా.. వారికి సబంధం ఉండదు. తమ రెమ్యూనరేషన్ తమకు వస్తే చాలు అనుకుంటారు. 

కాని చిన్న నిర్మాతలు సినిమా ప్లాప్ అయితే.. ఎంత ఇబ్బంది పడతారు.. ఫైనాన్స్ తెచ్చుకున్నవారి పరిస్థితి ఏంటీ అని అందరూ ఆలోచించరు. కాని కొంత మంది హీరోలు మాత్రం తమకు లైఫ్ ఇచ్చి..తమతో మంచి మంచి సినిమాలు చేస్తున్న నిర్మాతల కష్టసుఖాలల్లోఎప్పుడూ తోడుగా ఉంటారు. తాజాగా శివకార్తికేయన్ కూడా అదే పని చేశాడు.  కానీ, కొంతమంది హీరోలు మాత్రం సినిమా ఫ్లాప్ అయితే నిర్మాతలకు అండగా నిలబడి వారు నష్టపోకూడదని రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేస్తారు. ఇప్పటికే ఇదే తరహలో మన తెలుగు హీరోలు చాలామంది ఉన్నారు. తాజాగా శివ కార్తికేయన్ కూడా అదే పని చేస్తున్నారు. ఓ నిర్మాతకు అండగా నిలిచి తన గొప్ప మనసును చాటుకున్నారు. 

తాజాగా ఆయన ఆర్‌.రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్న అయలాన్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. కాగా, ఈ సినిమాను డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. ఇక ‘అయలాన్’ సినిమాలో కార్తికేయన్ ఓ ఏలియన్ తో స్నేహం చేయనున్నాడు. అలాగే సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ కథతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి ప్రీరిలీజ్ ఈవెంట్ ను చెన్నైలో నిర్వహించారు. ఇక ఆ కార్యక్రమంలో శివకార్తికేయన్ మాట్లాడుతూ..’ఈ సినిమాలో హింసాత్మక సంఘటనలు గానీ, తుపాకీ శబ్దాలు గానీ, అశ్లీల సన్నివేశాలు గానీ ఉండవని తెలిపారు. అలాగే ఈ సినిమా తమిళనాట ముఖ్యమైన సినిమాగా మిగిలిపోతుందని అన్నారు. కాగా అయలాన్ సినిమా నిర్మాణ సమయంలో.. చిత్ర నిర్మాత చాలా సమస్యలు ఎదుర్కొన్నారని చెప్పారు. 

అందుకే తాను కూడా ఈ మూవీ విషయంలో రెమ్యునరేషన్ తీసుకోలేదని పేర్కొన్నాడు. కాగా, రెమ్యునరేషన్ ఇవ్వకపోయినా పర్వలేదు కానీ, సినిమాను మాత్రం ఎలాగైనా పూర్తి చేయమని చెప్పేనన్నారు. ఇక సినిమా ఇక ఈ సినిమా టీజర్ కంటే ట్రైలర్ అదిరిపోతుందని’ శివకార్తికేయన్ తెలిపారు. అలాగే 2024 జనవరి 5వ తేదిన ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. దాంతో ఈ హీరోపై అందరిలో గౌరవం రెట్టింపుఅయ్యింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios