టాలీవుడ్ టాప్ సింగర్ సునీత సినిమాల్లో పాటలు మాత్రమే కాదు.. అప్పుడప్పుడు స్టేజ్ షోల్లో కూడా కనిపిస్తుంటుంది. విదేశాల్లో మాత్రమే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆమె స్టేజ్ షోలు ఇస్తుంటుంది. 

నిన్న సాయత్రం శ్రీకాకులతో ఆమె సంగీత విభావరి కార్యక్రమం ఏర్పాటు చేయాల్సివుంది. అయితే పోలీసుల నుండి దీనికి సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకోకపోవడంతో చివరి నిమిషంలో పోలీసులు ఆ కార్యక్రమాన్ని ఆపేశారు.

ఏపీ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగర వైఎస్ఆర్ కూడలిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సునీత పాటలు పాడేందుకు అక్కడకి వెళ్లారు. పోలీసుల నుండి అనుమతి తీసుకోవడంలో నిర్వాహకులు ఆలస్యం చేయడంతో షోని క్యాన్సిల్ చేసే పరిస్థితి వచ్చింది. 

గురువారం సాయంత్రం నిర్వాహకులు పోలీస్ పర్మిషన్ కోసం ప్రయత్నించగా వారి నుండి అనుమతి వచ్చేసారి రాత్రి 8 గంటలు అయింది. అప్పటికే షో కోసం వచ్చిన జనాలు, అతిథులు అక్కడ నుండి వెళ్లిపోయారట. అలా షోని క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో సునీత నిర్వాహకులపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.