పాప్ సింగర్ స్మిత సోషల్ మీడియా వేదికగా ఓ సంచలన కామెంట్ చేశారు. ట్విట్టర్ లో ఆమె పోస్ట్ చేసిన ఓ కామెంట్ పెద్ద చర్చకు దారితీసింది. ఆమె పోస్ట్  కారణంగా రెండు పార్టీల అభిమానుల మధ్య కామెంట్స్ వార్ నడుస్తుంది. నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు నేడు బర్త్ డే జరుపుకుంటున్నారు. దీనితో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు, నేతలు ఆయనకు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. 


ఇక సీబీఎన్ అంటే గిట్టని జగన్ ఫ్యాన్స్ మాత్రం ఉదయం నుండి నెగిటివ్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా వైసీపీ వర్గాల నెగిటివ్ బర్త్ డే ట్యాగ్ నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతుంది. ఇది టీడీపీ అభిమానులను ఆగ్రహానికి గురిచేసింది. అలాగే చంద్రబాబు బర్త్ డే నాడు కొందరు వైసీపీ కీలక నాయకులు బాబుపై విమర్శల దాడి చేశారు. 


ఇదిలా ఉండగా సింగర్ స్మిత 'ఏనుగు దారిన వెళుతుంటే కుక్కలు మొరుగుతాయి' అంటూ ట్విట్టర్ లో కామెంట్ పోస్ట్ చేశారు. స్మిత ఎవరిని ఉద్దేశించి అన్నారు అనేది ఆమె చెప్పలేదు. అయితే టీడీపీ ఫ్యాన్స్ స్మిత కామెంట్ వైసీపీ నాయకులు గురించే అని గట్టిగా నమ్ముతున్నారు. స్మిత టీడీపీ సానుభూతిపరురాలు కాగా, ఆమె చంద్రబాబును ఏనుగుగా, ఆయనను విమర్శించేవారిని కుక్కలుగా పోల్చుతూ ఆయన బర్త్ డే నాడు ఈ కామెంట్ చేశారని స్పష్టంగా అర్థం అవుతుంది. 

ఇక స్మిత కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె ట్విట్టర్ పోస్ట్ క్రింద వైసీపీ, టీడీపీ ఫ్యాన్స్ కామెంట్స్ రోపంలో కొట్టుకుంటున్నారు. క్రియేటివిటీ ఫీల్డ్ కి చెందిన స్మిత ఒక్క కామెంట్ తో రాజకీయ నాయకురాలిగా మారిపోయారు.