గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సింగర్ చిన్మయి సౌత్ లో గుర్తింపు సొంతం చేసుకుంది. అలాగే మహిళలపై జరిగే వేధింపుల విషయంలో చిన్మయి ఫైర్ బ్రాండ్ గా మారిపోయింది. 

గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సింగర్ చిన్మయి సౌత్ లో గుర్తింపు సొంతం చేసుకుంది. అలాగే మహిళలపై జరిగే వేధింపుల విషయంలో చిన్మయి ఫైర్ బ్రాండ్ గా మారిపోయింది. మీటూ ఉద్యమంలో భాగంగా చిన్మయి తరచుగా తన గళం వినిపిస్తూ ఉంటుంది. మహిళలని అవమానించేలా చిన్న సంఘటన జరిగినా చిన్మయి ఊరుకోవడం లేదు. 

మీటూ ఉద్యమం చెలరేగినప్పుడు చిన్మయి తమిళ లిరిసిస్ట్ వైరముత్తుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వైరాముత్తు తనని లైంగికంగా వేధించినట్లు చిన్మయి సంచలన ఆరోపణలు చేసింది. అప్పటి నుంచి ఈ వివాదం రగులుతూనే ఉంది. వైరముత్తుపై చిన్మయి పోరాడుతూనే ఉంది. 

తమిళ యువనటి అర్చన.. తాను వైరముత్తుని కలసినట్లు సోషల్ మీడియాలో పేర్కొంది. ఆ ఫోటోలని కూడా షేర్ చేసింది. అర్చన పోస్ట్ పై చిన్మయి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎప్పుడూ కూడా అతడిని ఒంటరిగా కలవొద్దని అర్చనని హెచ్చరించింది. 

'ఇలాగే మొదలవుతుంది. దయచేసి జాగ్రత్తగా ఉండు. సాధ్యమైనంతవరకు అతడిని దూరం పెట్టు. అతడిని ఒంటరిగా కలవొద్దు. ఒకవేళ కలవాల్సి వస్తే నీ పక్కన ఇంకెవరైనా ఉండేలా జాగ్రత్తపడు. అంటూ చిన్మయి అర్చనని హెచ్చరించింది. వైరాముత్తు స్వభావాన్ని తెలియజేసేలా చిన్మయి చేసిన ఈ హాట్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

View post on Instagram