ఒక సినిమా హిట్టయితే హీరోలు రెమ్యునరేషన్ పెంచినా పెంచకపోయినా హీరోయిన్స్ మాత్రం కచ్చితంగా పెంచేస్తారు. హీరోల కంటే తక్కువే తీసుకుంటారు కాబట్టి క్రేజ్ ఉన్నప్పుడే గట్టిగా లాగెయ్యాలి అనే కాన్సెప్ట్ ను ఎక్కువగా ఫాలో అవుతుంటారు. అయితే సాహో బ్యూటీ ఇప్పుడు సాహో సినిమాను దృష్టిలో పెట్టుకొని నిర్మాతలకు తన రేట్ తో షాకిస్తోందట. 

గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక సౌత్ ఇండస్ట్రీకి సంబందించిన సినిమాకు హైయ్యెస్ పేమెంట్ తీసుకున్న బ్యూటీ శ్రద్దా కపూర్. సాహో సినిమాకు గాను ఆమె పారితోషికం జీఎస్టీ కటింగ్స్ పోను 8కోట్లని తెలుస్తోంది. గతంలో అమ్మడు బాలీవుడ్ సినిమాలకు 5కోట్ల కంటే తక్కువే తీసుకుంది. అయితే సాహో సినిమాకు అంతగా తీసుకోవడానికి కారణం ఆమె ఎక్కువ రోజులు ఈ సినిమాకు డేట్స్ ఇవ్వడమే. 

అంతే కాకుండా పలు యాక్షన్ సన్నివేశాల్లో డూప్ లేకుండా నటించిందట. ఈ సినిమాకు ఒక హీరో ఎంతగా కష్టపడ్డాడో అదే స్థాయిలో హీరోయిన్ కూడా కష్టడినట్లు టాక్. ముందే ఈ విషయాన్నీ చెప్పిన సాహో టీమ్ ఆమె అడిగినంత ఇచ్చేశారు.. కాకపోతే అన్ని సినిమాలు సాహో లాగా 300కోట్ల బారి బడ్జెట్ తో తెరకెక్కవు. కానీ ఆ విషయాన్నీ పట్టించుకోకుండా శ్రద్దా తన దగ్గరకు వచ్చిన ప్రతి నిర్మాతకు 6కోట్లకు పైగా పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. 

ఇక సాహో సక్సెస్ అయితే ఆమె రెమ్యునేషన్ ఇంకా పెరిగే అవకాశం ఉందని బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అసలు అమ్మడు సాహో సినిమా కోసం ఎంత కష్టపడిందో తెలియాలంటే సినిమా రిలీజ్ డేట్ వరకు వెయిట్ చేయాల్సిందే.