శ్రద్దా దాస్ ను హాస్పిటల్ లో పడేలా కొట్టిన బాలీవుడ్ హీరోయిన్..
బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా దాస్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓహీరోయిన్ తనను గట్టిగా కొట్టిందని.. దాంతో తాను హాస్పిటల్ లో చేరాల్సి వచ్చిందంటోంది. ఇంతకీ విషయం ఏంటంటే..?
శ్రద్ధా దాస్ గుర్తుండే ఉంటుంది. ప్రస్తుతం సోసల్ మీడియలో రెచ్చిపోతూ.. హాట్ హాట్ ఫోటో షూట్లతో అలరిస్తున్న ఈబ్యూటీ.. ఈమధ్య వరకూ బాలీవుడ్ తో పాటు.. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో కూడా వరుసగా సినిమాలు చేసింది. హీరోయిన్ గా, సెకండ్ హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాఇలా రకరకాల పాత్రలు పోషించింది బ్యూటీ. తెలుగులో సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం, డార్లింగ్, ఆర్యా2 లాంటి సినిమాల్లో మెప్పించింది బ్యూటీ. ఆర్యా2 శ్రద్దా దాస్ కు మంచిపేరు తీసుకువచ్చింది.
తెలుగుతో పాటు హిందీలోనూ నటించి మెప్పిస్తుంది శ్రద్ధా దాస్. ఇదిలా ఉంటే ఓ హీరోయిన్ తనను దారుణంగా కొట్టిందని దాంతో హాస్పటల్ లో చేరానంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది శ్రద్దాదాస్. ఈ ఘటన జరిగి చాలాకాలం అయ్యింది. కాని అప్పుడు శ్రద్దాదాస్ చేసిన కామెంట్స్.. చెప్పిన విషయం ఇప్పుడు హైలెట్ అవుతోంది. అయితే శ్రద్దా దాస్ ను కొట్టిన హీరోయిన్ ఎవరు కాదు మన్నారా చోప్రా. అవును బాలీవుడ్ స్టార్.. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కజిన్ అయిన మన్నారా చోప్రా శ్రద్దాను కొట్టిందట.
అయితే ఇది ఎప్పుడు ఏ సినిమా షూటింగ్ లో జరిగిందంటే..? ప్రేమ గీమ జాన్‌తా నయ్ అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది మన్నారా చోప్రా. తెలుగులో ఈ అమ్మడు పలు సినిమాల్లో నటించింది. మన్నారా చోప్రా, శ్రద్ధా దాస్ కలిసి హిందీలో ఓ సినిమాలో నటించారు. అయితే ఆ సినిమా షూటింగ్ లో ఈ ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరిగిందట. అయితే ఓ సన్నివేశంలో మన్నారా చోప్రా శ్రద్దా ను తోసే సన్నివేశం ఉందట.. మెల్లగా నెట్టమని చెప్పినా కూడా మన్నారా చోప్రా వినకుండా గట్టిగా నెట్టేసిందట. దాంతో మెట్లు తగిలి శ్రద్ధా దాస్ గాయం అయ్యిందట.
అప్పుడు శ్రద్దా దాస్ యాక్టింగ్ కొత్త కథ అని సర్ధుకుపోయిందట. కాని ఆతర్వాత సీన్ లో కూడా తన చాటి పై పంచ్ ఇవ్వాల్సిన సీన్ లో మన్నారా మాత్రం గట్టిగా గుద్దిందట. ఆ తర్వాత సీన్ లో మన్నారా గట్టిగా కొట్టేడం.. డైరెక్టర్ కట్ చెప్పినా కూడా వినకుండా కొడుతూనే ఉందట. దాంతో శ్రద్దాకుశరీరంపై దాదాపు 30 గాయాలు అయ్యాయట.. అలాగే ఓ ఫైట్ సీన్ లో డమ్మీ స్టిక్ తో కొట్టాల్సింది రియల్ స్టిక్ తో కొట్టడంతో కంటికి కూడా గాయం అయ్యిందట. ఇన్ని గాయాలు అవ్వడంతో శ్రద్దా దాస్ హాస్పటల్ లో చేరాల్సి వచ్చిందని వివరించిందిశ్రద్దా. రీసెంట్ గా మన్నారా చోప్రా హిందీ బిగ్ బాస్ 17 లో పాల్గోంది.