ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది  హీరోయిన్ శివాత్మిక. ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. రంగమార్తాండ సినిమాకు సబంధించిన కొన్ని విషయాలు ఆడియన్స్ తో పంచుకుంది.


రాజశేఖర్ నటవారసత్వాన్ని తీసుకుని సినిమాల్లోకి వచ్చింది శివాత్మిక రాజశేఖర్. 18 ఏళ్ళకే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. దొరసాని సినిమాతో.. తన టాలెంట్ ను నిరూపించుకుంది. అయితే ఓ హీరో కూతురిగా వరుసగా కమర్షియల్ సినిమాలే చేయాలని గీత పెట్టుకోకుండా.. కథాబలం ఉన్న... మంచి మంచి సినిమాలు ఎంచుకుని మరీ చేస్తూ వస్తోంది బ్యూటీ. అందుకే టాలీవుడ్ లో ఎక్కువగా సినిమాలు చేయలేదు శివాత్మిక. తెలుగు,తమిళ భాషల్లో కొన్నిసినిమాలు మాత్రమే చేసింది బ్యూటీ. 

రీసెంట్ గా  కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ట్ మూవీ..రంగమార్తాండ లో నటించి ఆడియన్స్ ను మెప్పించింది శివాత్మిక.  ప్రకాష్ రాజ్ కూతురిగా ఈసినిమాలో అద్భుతమైన నటనను ప్రదర్శించింది శివాత్మిక. కొన్ని సన్నివేశాల్లో అయితే.. ఆమె నటన  కన్నీళ్లు పెట్టించింది. కమర్షియల్ గా ఆలోచించలేయు కాని.. సినిమా పరంగా రంగమార్తాండ సినిమా మంచి విజయం సాధించిందనే చెప్పాలి. 

ఇక ఈసినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది శివాత్మిక. ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. సినిమాకుసబంధించిన కొన్ని విషయాలు ఆడియన్స్ తో పంచుకుంది. శివాత్మిక మాట్లాడుతూ..రంగమార్తాండ లో నాది మెయిన్ లీడ్ కాదు, ఇది కమర్షియల్ సినిమా కూడా కాదు. దాంతో ఈసినిమా  చెయ్యొద్దు అన్నారు. ఆ సినిమా చేస్తే నీకు అవకాశాలు రావు, నీ కెరీర్ ఇక్కడితో ఆగిపోతుంది..  క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయడం.. హీరోయిన్ గా  నీ లైఫ్ పై ప్రభావం పడుతంది అన్నారట.

అంతే కాదు ఇప్పుడు అలాంటి సినిమా ఎవరూ చూడరు అని అన్నారని చెప్పుకొచ్చింది శివాత్మిక. కాని వారి మాటలు నేను పట్టించకోలేదు. ఈసినిమా చేసి మంచి సంతృప్తిని పొందాను.. సినిమా మంచి విజయం కూడా సాధించించి అన్నారు శివాత్మిక. ఇక సినిమా గురించి మరిన్ని విషయాలు చెప్పారు శివాత్మిక. ఇక తన మేకప్ గురించి చెప్తూ.. ఇప్పటివరకు ఏ సినిమాలోనూ మేకప్ వేసుకోలేదన్నారు. చేసినవన్నీ.. నార్మల్ పాత్రేకావడంతో..  డైరెక్టర్స్ కూడా మేకప్ వద్దన్నారు. నాకేమో మేకప్ వేసుకోవడం ఇష్టం అని తెలిపింది శివాత్మిక. అలాగే నాన్న రాజశేఖర్ తో కూడా కలిసి వర్క్ చేయాలని ఉందని తెలిపింది యంగ్ హీరోయిన్.