బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి(Shilpa Shetty )ని తన డ్రెస్ తెగ ఇబ్బంది పెట్టింది. మీడయా ముందు ఆమె పరువు తీసింది. ఆగమంటే ఆగనంటూ ఎగిరెగిరి పడుతూ.. ఇరకాటంలో పడేసింది.

బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి(Shilpa Shetty )ని తన డ్రెస్ తెగ ఇబ్బంది పెట్టింది. మీడయా ముందు ఆమె పరువు తీసింది. ఆగమంటే ఆగనంటూ ఎగిరెగిరి పడుతూ.. ఇరకాటంలో పడేసింది.

బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టికి (Shilpa Shetty ) విచిత్ర సంఘటన ఎదురైంది. మీడియా ముందు తెగ ఇబ్బంది పడింది. తను వేసుకున్న డ్రెస్ తనను బాగా ఇబ్బంది పెట్టడంతో చెప్పుకోలేక.. అక్కడి నుంచి తప్పుకోలేక.. ఇబ్బంది పడుతూనే మీడియాకు ఫోజులు ఇవ్వబోయింది. ఇక ఎంత సేపటికి పరిస్థితి మారకపోవడంతో.. ఇక చాలా అనుకుందో ఏమో కాని అక్కడి నుంచి చిన్నగా తప్పకుంది శిల్ప.

ఇంతకీ ఈ సీన్ అంతా ఎందుకు జరిగింది అంటే.. శిల్పా శెట్టి(Shilpa Shetty ) చెల్లెలు షమితా శెట్టి (Shamita Shetty). ఈమె కూడా బాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమే. తెలుగులో కూడా ఓ చిన్న సినిమా చేసింది షమితా శెట్టి. తన చెల్లెలు షమితా శెట్టి పుట్టిన రోజు సందర్భంగ ఫిబ్రవరి 2న ఫ్యామిలీ అంతా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఫ్యామిలీ అందరూ కలిసి ఓ రెస్టారెంట్ లో పార్టీ కూడా చేసుకున్నారు.

ఈ పార్టీ సందర్భంగా మీడియా కూడా హడావిడి చేసింది. శిల్పా శెట్టి (Shilpa Shetty ) ని స్పెషల్ గా కవరేజ్ చేసింది. అయితే మీడియ ముందుకు వచ్చి ఫోటోలకు ఫోజులు ఇవ్వాలి అని చూసిన శిల్పా శెట్టి(Shilpa Shetty ) కి చేదు అనుభవం ఎదురయ్యింది. కరెక్ట్ గా ఆమె కెమెరాల ముందుకు వచ్చే టైమ్ కు గట్టిగా గాలి వీచింది. ఆ గాలి వల్ల ఆమె వేసుకున్న ఆరెంజ్ కలర్ సిల్క్ డ్రెస్ ఒక్క సారిగా పక్కకు జరగడం మొదలైయ్యింది.

View post on Instagram

అసలే జారే గుణం ఉన్న క్లాత్ కావడంతో.. గాలీ బలంగా వీచడంతో .. కాళ్ల దగ్గర డ్రెస్ పక్కకు జరగడం వల్ల శిల్పా శెట్టి(Shilpa Shetty ) బాగా ఇబ్బంది పడింది. చేతితో కవర్ చేసుకుంటూనే కెమెరాలకు ఫోజులు ఇద్దామని చూసింది. కాని పరిస్థితి మారకపోగా.. ఇంకా ఇబ్బందిగా తయారు అయ్యింది. దాంతో శిల్ప అటు ఇటు ఫోజులు మార్చుకుంటూ.. ఇబ్బంది గానే ప్రోఫైల్ ఇచ్చి.. వెంటనే అక్కడి నుంచి వెళ్లి పోయింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ సీన్ పై నెట్టింట్లో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. కొంతమంది నెటిజన్లు.. అయ్యో పాపం శిల్పా శెట్టి (Shilpa Shetty ) అంటూ జాలి పడుతుంటే.. మరికొంత మంది నెటిజన్లు మాత్రం.. అంత ఇబ్బంది లో కూడా ఫోటోలకు ఫోజులు ఇవ్వడం అవసరమా.. అయినా అంత ఇబ్బందిగా ఉంటే అలాంటి డ్రెస్ లు ఎందుకు వేసుకోవడం అన్నట్టు కామెంట్లు పెడుతున్నారు.