ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి సాక్షి శివానంద్ పై తన సోదరి శిల్పా ఆనంద్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. సాక్షి తనను చంపాలని చూస్తోందని శిల్పా ఆనంద్ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

సాక్షి శివానంద్ భీమా డబ్బుల కోసం తన అత్తతో కలిసి శిల్పా ఆనంద్ ని చంపాలని చూస్తోందట. సొంత  అక్కడ ఇలా చేయడానికి ప్రయత్నిస్తుందని సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా వెల్లడించింది శిల్పా ఆనంద్. సాక్షి శివానంద్ అత్త భావన భీమా డబ్బుల కోసం కట్టుకున్న భర్తను చంపేసిందని శిల్పా తెలిపింది.

ఆ సమయంలో శిల్పా తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు సాక్షి భీమా డబ్బుల కోసం తన అత్తతో కలిసి తనను, తన తల్లిని చంపాలని చూస్తోందని శిల్పా తెలిపింది. పోలీసులు ఎక్కడ పట్టుకుంటారోనని భావాన్ అమెరికాకు పారిపోయిందని.. ఆమె ఎప్పుడొస్తే అప్పుడు అరెస్ట్ చేయడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారని వెల్లడించింది. 

ఈ విషయంలో అభిమానులు, తనకు తెలిసిన వారు సాయం చేస్తారని కోరుతున్నట్లు పోస్ట్ లో రాసుకొచ్చింది. సాక్షి శివానంద్ తెలుగులో యువరాజు, ఇద్దరు మిత్రులు, సీతారామారాజు ఇలా చాలా చిత్రాల్లో నటించింది. ఇక శిల్పా ఆనంద్ మంచు విష్ణు నటించిన 'విష్ణు' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.