Asianet News TeluguAsianet News Telugu

కత్రినా నన్ను వదిలేసింది.. సల్మాన్ కామెంట్స్!

సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా చాలా సినిమాలే చేశారు. ఈ జంటకి బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది.

She Even Left Me Says Salman Khan
Author
Hyderabad, First Published May 30, 2019, 2:19 PM IST

సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా చాలా సినిమాలే చేశారు. ఈ జంటకి బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. పైగా ఒకప్పుడు ఇద్దరూ ప్రేమించుకున్నారని టాక్. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి 'భారత్' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా ఓ కామెడీ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కత్రినా ఇంత ఫిట్ గా ఉండడానికి కారణం ఏంటనే విషయంపై చర్చ నడిచింది. 2009లో 'దే దనా దన్' సినిమా చిత్రీకరణ సమయంలో కత్రినా స్మూతీలు తినడం మానేశారట.

ఈ విషయాన్ని కత్రినా ఫిట్ నేస ట్రైనర్ అర్చనా పురాన్ సింగ్ వెల్లడించారు. అవి తినడం మానేసిన తరువాత ఆమె మరింత ఫిట్ గా తయారయ్యారని అన్నారు. ఈ మాట విన్న సల్మాన్ వెంటనే.. 'ఆ సినిమా సమయంలో కత్రినా స్మూతీలనే కాదు నన్ను కూడావదిలేసిందని' అన్నారు.

దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. 'దే దనా దన్' సినిమా విడుదలైన ఏడాదిలోనే కత్రినా.. రణబీర్ తో ఓ సినిమా చేసింది. ఆ సమయంలో ఇద్దరూ ప్రేమించుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ కారణంగానే సల్మాన్ కూడా ఈ రకమైన కామెంట్స్ చేసి ఉంటారని అంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios