Asianet News TeluguAsianet News Telugu

కొత్త చిత్రంకు `శ్రీకారం` చుట్టిన శ‌ర్వానంద్‌!

 `96` సినిమా కోసం స్కూబా డైవింగ్ ప్రాక్టీస్ చేస్తున్న స‌మయంలో శ‌ర్వానంద్ తీవ్రంగా గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. భుజానికి తీవ్ర గాయ‌మ‌వ‌డంతో ఆపరేషన్ చేయించుకున్నాడు. డాక్టర్ల పర్యవేక్షణలో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు  

Sharwanand's 'Sreekaram'movie launched!
Author
Hyderabad, First Published Jun 30, 2019, 1:14 PM IST

`96` సినిమా కోసం స్కూబా డైవింగ్ ప్రాక్టీస్ చేస్తున్న స‌మయంలో శ‌ర్వానంద్ తీవ్రంగా గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. భుజానికి తీవ్ర గాయ‌మ‌వ‌డంతో ఆపరేషన్ చేయించుకున్నాడు. డాక్టర్ల పర్యవేక్షణలో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు  శ‌ర్వానంద్. అలాగని రెస్ట్ తీసుకోదలుచుకోలేదు.  త‌న త‌ర్వాతి సినిమాల‌పై దృష్టి పెట్టాడు.

తాజాగా 14 రీల్స్ సంస్థ నిర్మించ‌బోతున్న సినిమాను లాంఛ‌నంగా ప్రారంభించాడు.ఈ రోజు (ఆదివారం) పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు. ఈ సినిమాకు `శ్రీకారం` అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.   ఈ సినిమాకు సుకుమార్ క్లాప్ కొట్టాడు. శశికాంత్ వల్లూరి కెమెరా స్విచ్ఛాన్ చేసారు. హీరోగా శర్వానంద్‌కు ఇది 29వ సినిమా.

కొత్త ద‌ర్శ‌కుడు కిషోర్ రెడ్డి ఈ సినిమాను రూపొందించ‌బోతున్నాడు. సాయి మాధ‌వ్ బుర్రా ఈ సినిమాకు మాట‌లందిస్తున్నారు. మిక్కీ జే మేయ‌ర్ సంగీత ద‌ర్శ‌కుడు. ఆగస్టు మొద‌టి వారం నుంచి ఈ సినిమా రెగ్యుల‌ర్‌ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడ‌ుద‌ల చేయాల‌ని భావిస్తున్నారు. మరో పక్క శర్వానంద్ సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రణ రంగం’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో శర్వానంద్.. గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తున్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios