Asianet News TeluguAsianet News Telugu

రాజమౌళి రేంజ్ లో శంకర్ మల్టీస్టారర్

ఆకాశమంతా అంచనాలతో సినిమాను తెరకెక్కించి ఎలాగైనా ఫస్ట్ షో  చూడాలనే కోరికను కలిగించగల దర్శకుడు శంకర్. అయితే రోబో తరువాత శంకర్ అనుకున్నంతగా మెప్పించలేకపోతున్నాడు. పైగా ఆయన సినిమాలు షూటింగ్ దశలోనే ఇబ్బందులు ఎదుర్కోవడం హాట్ టాపిక్ గా మారుతోంది.

shankar planning on huge multistarrer
Author
Hyderabad, First Published May 3, 2019, 9:01 PM IST

ఆకాశమంతా అంచనాలతో సినిమాను తెరకెక్కించి ఎలాగైనా ఫస్ట్ షో  చూడాలనే కోరికను కలిగించగల దర్శకుడు శంకర్. అయితే రోబో తరువాత శంకర్ అనుకున్నంతగా మెప్పించలేకపోతున్నాడు. పైగా ఆయన సినిమాలు షూటింగ్ దశలోనే ఇబ్బందులు ఎదుర్కోవడం హాట్ టాపిక్ గా మారుతోంది. 2.0 తరహాలో ఇండియన్ 2 సినిమాకు బ్రేకులు పడుతున్నాయి. 

కమల్ హాసన్ చేస్తోన్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే షూటింగ్ కి ఇటీవల బ్రేక్ పడింది. మళ్ళీ మొదలవ్వడమనేది అనుమానంగా మారింది. సినిమాను బాలీవుడ్ బడా ప్రొడక్షన్ రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ టేకప్ చేసే అవకాశం ఉంది. 

దీంతో శంకర్ భారతీయుడు 2ప్రాజెక్ట్ ని పక్కనెట్టి మరో సినిమాను మొదలెట్టాలని చూస్తున్నాడు. అది కూడా భారీ మల్టీస్టారర్ అని తెలుస్తోంది. రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ లతో రాజమౌళి తెరకెక్కిస్తున్నట్లు శంకర్ కూడా తనదైన శైలిలో ఒక డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ కి శ్రీకారం చుడుతున్నట్లు సమాచారం. 

అందులో విజయ్ - విక్రమ్ నటించే అవకాశం ఉన్నట్లు టాక్. విజయ్ తో ఇదివరకే శంకర్ స్నేహితుడు (3 ఇడియట్స్ రీమేక్) చేశాడు. ఇక విక్రమ్ తో అపరిచితుడు - ఐ సినిమాలు చేశారు. మరి 200 కోట్ల మార్కెట్ ఉన్న ఈ ఇద్దరి స్టార్ హీరోలతో శంకర్ ఎలాంటి సినిమాను చేస్తాడో చూడాలి.  

Follow Us:
Download App:
  • android
  • ios