Asianet News TeluguAsianet News Telugu

బాలీవుడ్ హిరోతో శంకర్ విజువల్ వండర్?

2.0 మొత్తానికి ఎదో ఒక విధంగా ఆడేసింది. పెద్దగా నష్టాలను మిగిల్చలేదు గాని చాలా వరకు నిర్మాతను సేఫ్ జోన్ లోకి తేగలిగింది. అయితే శంకర్ 2పాయింట్O విషయంలో జరిగిన తప్పులను నెక్స్ట్ ఏ సినిమాలో కూడా జరగకూడదని ముందుగానే కొన్ని ప్లాన్స్ రెడీ చేసుకొని సెట్స్ పైకి ప్రాజెక్టులను తీసుకెళుతున్నాడు. 

shankar movie with hruthik roshan
Author
Hyderabad, First Published Jan 2, 2019, 6:43 PM IST

2.0 మొత్తానికి ఎదో ఒక విధంగా ఆడేసింది. పెద్దగా నష్టాలను మిగిల్చలేదు గాని చాలా వరకు నిర్మాతను సేఫ్ జోన్ లోకి తేగలిగింది. అయితే శంకర్ 2పాయింట్O విషయంలో జరిగిన తప్పులను నెక్స్ట్ ఏ సినిమాలో కూడా జరగ్గకూడదని ;ముందుగానే కొన్ని ప్లాన్స్ రెడీ చేసుకొని సెట్స్ పైకి ప్రాజెక్టులను తీసుకెళుతున్నాడు. 

ప్రస్తుతం కమల్ హాసన్ తో భారతీయదు సీక్వెల్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా అనంతరం శంకర్ మరో స్కై ఫై థ్రిల్లర్ కథాంశంతో వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. బాలీవుడ్ యాక్షన్ హీరో హృతిక్ రోషన్ కి ఇప్పటికే కథను వినిపించగా అతని నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు టాక్ వస్తోంది. 

వీలైనంత త్వరగా కమల్ హాసన్ తో భారతీయుడు 2 సినిమాను ఫినిష్ చేసి బాలీవుడ్ లో హృతిక్ తో ఒక విజువల్ వండర్ ని స్టార్ట్ చేయాలనీ శంకర్ ప్లాన్ చేస్తున్నాడట. గ్రాఫిక్స్ తో పాటు ఆ సినిమాలో భారీ యాక్షన్ సీన్స్  ఉంటాయని తెలుస్తోంది. బాలీవుడ్ లోని  ప్రముఖ నిర్మాణ సంస్థ శంకర్ - హృతిక్ చిత్రాన్ని నిర్మించేందుకు అఫర్ చేసినట్లు సమాచారం. 

Follow Us:
Download App:
  • android
  • ios