దేశం మెచ్చిన స్టార్ దర్శకుడు శంకర్ లక్కేమిటో గాని పరిస్థితులు ఒక్కోసారి ఏ మాత్రం అనుకూలించవు. అయితే ఎన్ని ఆటుపోట్లు ఎదురైనప్పటి కూడా తాను అనుకున్న ప్రాడక్ట్ ని తెరకెక్కించే వరకు ఈ బడా దర్శకుడు వెనక్కి తగ్గడు. ప్రతిసారి బడ్జెట్ విషయంలో తడబడుతున్న శంకర్ ఈ సారి భారతీయుడు 2 విషయంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. 

2.ఓ సినిమాను నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ భారతీయుడు 2 సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా బడ్జెట్ కారణాల వల్ల ఇటీవల ఆగిపోయింది. శంకర్ దాదాపు సినిమాను పక్కనే పెట్టేసినట్లు టాక్ వచ్చింది. అయితే ఫైనల్ గా ఇప్పుడు ఈ బారి బడ్జెట్ సీక్వెల్ పట్టాలెక్కుతున్నట్లు సమాచారం. 

నిర్మాతతో ఇటీవల చర్చలు జరిపిన దర్శకుడు సినిమా బడ్జెట్ విషయంలో కాస్త తగ్గి సినిమాను స్టార్ట్ చేద్దామని చర్చించినట్లు టాక్. కుదిరితే ఈ సినిమా షూటింగ్ జూన్ 21న మొదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కమల్ హాసన్ సరసన ఈ సినిమాలో కాజల్ నటిస్తుండగా వెన్నల కిషోర్ ఒక పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు.