దేశం మెచ్చిన స్టార్ దర్శకుడు శంకర్ టైమ్ అస్సలు బాలేనట్టుంది. బడా ప్రాజెక్టులు మొదలుపెడితే ఎదో ఒక అంతరాయంతో వివిధ రకాలుగా షూటింగ్ లకు బ్రేక్ పడుతోంది.

దేశం మెచ్చిన స్టార్ దర్శకుడు శంకర్ టైమ్ అస్సలు బాలేనట్టుంది. బడా ప్రాజెక్టులు మొదలుపెడితే ఎదో ఒక అంతరాయంతో వివిధ రకాలుగా షూటింగ్ లకు బ్రేక్ పడుతోంది. భారతీయుడు 2 కారణంగా ప్రస్తుతం శంకర్ ఎవరు ఊహించని డైలమా లో ఉన్నాడు. ఓ వైపు కమల్ హాసన్ ని ఏమనలేక మరోవైపు నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ హౌస్ కి సమాధానం చెప్పలేక టెన్షన్ తో తల పట్టుకున్నాడు. 

అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఇండియన్ 2 సినిమా రీసెంట్ గా మొదలైన సంగతి తెలిసిందే. అయితే షూటింగ్ మధ్యలో కథానాయకుడు కమల్ హాసన్ పాలిటిక్స్ అంటూ పక్కదారి పట్టాడు. ఓ వైపు నిర్మాణ సంస్థ లైకా షూటింగ్ కి ఆలస్యం అయితే అనుకున్న షెడ్యూల్స్ ని క్యాన్సిల్ చేసి మళ్ళీ మరో షెడ్యూల్ కి స్కెచ్ వేయాలి. కొత్తగా ఇతర నటీనటుల డేట్స్ కోసం ప్రయత్నించాలి. అలాగే సెట్స్ కోసం మరో అధిక ఖర్చు.

ఈ బాధలు భరించలేక శంకర్ పై ప్రెజర్ పెట్టేస్తున్నారు, కమల్ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఇండియన్ 2 ప్రాజెక్ట్ బాలీవుడ్ నిర్మాణ సంస్థ రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ కి షిఫ్ట్ కానున్నట్లు తెలుస్తోంది. కుదిరితే పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకొని ఇన్ని రోజులు లైకా వారు ఖర్చు చేసిన డబ్బును కూడా వెనక్కి ఇవ్వాలని ఆ బడా సంస్థ చర్చలు జరుపుతున్నట్లు టాక్. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.