Asianet News TeluguAsianet News Telugu

శకుంతల దేవి ఓటీటీ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్

ఇప్పటికే పలు భారీ చిత్రాలను డైరెక్ట్‌గా డిజిటల్లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్న అమేజాన్ ప్రైమ్ శకుంతలా దేవి సినిమాను డిజిటల్‌ రిలీజ్‌ చేయనుంది. కొద్ది రోజులు ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ విషయంలో నెలకొన్న సందిగ్థతకు శుభం పలికింది అమెజాన్‌. జూలై 31నుండి శకుంతలా దేవి ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తుందని అమెజాన్‌ ప్రైమ్ ప్రకటించింది.

Shakunthala Devi will Streaming from July 31
Author
Hyderabad, First Published Jul 3, 2020, 4:50 PM IST

ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటించిన బయోగ్రాఫికల్‌ డ్రామా మూవీ శకుంతలా దేవి. హ్యూమన్ కంప్యూటర్ శకుంతలా దేవి జీవిత కథ ఆదారంగా తెరకెక్కిన ఈ సినిమాను ముందుగా థియేటర్లలో రిలీజ్‌ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే పరిస్థితి కనిపించకపోవటంతో డైరెక్ట్ ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతున్నారు చిత్రయూనిట్‌.

ఇప్పటికే పలు భారీ చిత్రాలను డైరెక్ట్‌గా డిజిటల్లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్న అమేజాన్ ప్రైమ్ ఈ సినిమాను డిజిటల్‌ రిలీజ్‌ చేయనుంది. కొద్ది రోజులు ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ విషయంలో నెలకొన్న సందిగ్థతకు శుభం పలికింది అమెజాన్‌. జూలై 31నుండి శకుంతలా దేవి ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తుందని అమెజాన్‌ ప్రైమ్ ప్రకటించింది. అను మీనన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని వికాస్ మల్హోత్రా నిర్మించాడు.

ఇక ఈ సినిమానే కాదు మరిన్ని బాలీవుడ్‌ చిత్రాలు డైరెక్ట్‌గా డిజిటల్‌లో రిలీజ్‌ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల మరణించిన యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన ఆఖరి చిత్రం దిల్ బెచార.. జూలై 24న డిస్నీ+హాట్ స్టార్ లో రిలీజ్‌ కానుంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌ కుమార్ హీరో గా నటించిన సౌత్‌ సూపర్‌ హిట్ కాంచన రీమేక్‌  లక్ష్మి బాంబ్, భుజ్ ది ప్రైడ్ అఫ్ ఇండియా, సడక్ 2, ది బిగ్ బుల్ లాంటి సినిమాలు డిస్నీ +హాట్ స్టార్ ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయనుంది. జాన్వీ కపూర్‌ ప్రధాన పాత్రలో నటించి బయోగ్రాఫికల్ మూవీ గుంజన్ సక్సెనా కూడా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios