షారూఖ్ ఖాన్ ఒకప్పుడు పెద్ద సంచలనం. ఆయన ఏ సినిమా చేస్తున్నాడు, ఏ దర్శకుడుతో చేస్తున్నాడనేది దేశం అంతటా చర్చంచుకునేవారు. అలాంటిది గత కొంతకాలంగా షారూఖ్ తన ప్రాభవం కోల్పోయారు. ముఖ్యంగా జీరో ప్లాఫ్ తర్వాత ఆయన మరీ డీలా పడిపోయారు. ఇదిలా ఉంటే ఇదే టైమ్ లో ఆస్తి తగాదాలు, కోర్ట్ లు ఆయన్ని ఇబ్బంది పెడుతున్నాయి.

ఏ సినిమా ఒప్పుకోవాలో అర్దం కాని కన్ఫూజన్. ఈ నేపధ్యంలో షారూఖ్ గురించిన ఓ వార్త సౌతిండియా మీడియాని కుదిపేస్తోంది. అది మరేదో కాదు బాలీవుడ్ బాద్ షా సౌత్ సినిమాలో విలన్ గా కనిపించడము. అదీ కూడా ఇలయదళపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్రం లో. వాస్తవానికి ఈ చిత్రంలో  షారూక్ ఓ అతిధి పాత్రలో నటిస్తున్నారని గత కొంతకాలంగా  వార్తలు వస్తూనే ఉన్నాయి.

అయితే షారూక్ అతిధి పాత్రలో కాదు ఏకంగా విలన్ పాత్రలో నటిస్తున్నారనేది ఇప్పుడు అంటున్న మాట. షారూక్  పది హేను మిషాల పాటు బిగిల్ చిత్రంలో కనిపిస్తారు. విజయ్ తో ఓ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉంటుంది. కథని కీలక మలుపు తిప్పే విలన్ పాత్ర ఇదని తమిళ, హిందీ  మీడియాల్లో ప్రచారమవుతోంది. అలాగే ఇది కొత్తగా షారూఖ్ ఒప్పుకున్న సినిమా కాదని, జీరో చిత్రం ప్రమోషన్స్ సమయంలోనే ఇది ఖరారైందని  చెప్తున్నారు.

అప్పట్లో ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు.. దర్శకుడు అట్లీ నేరుగా షారూక్ ని కలుసుకుని ఒప్పించారని  మీడియా అంటున్నారు.  జీరో తర్వాత ఇప్పటివరకూ షారూక్ వేరొక సినిమాకి  సైన్  చేయలేదు. మరి ఈ ఆఫర్ ని  ఆయన ఓకే చేసి చేస్తున్నారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.